బాలీవుడ్ కి సంబందించిన మరో సెక్స్ రాకెట్ విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతకొంత కాలంగా ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ మేనేజర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర పోలీసులు వ్యభిచార కేసులపై ఇటీవల సీరియస్ గా విచారణ జరుపగా బాలీవుడ్ లోని రాజేశ్‌ కుమార్‌ లాల్‌ అనే ప్రొడక్షన్ మేనేజర్ అసలు గుట్టు బయటపడింది,

హు సబర్బన్‌లోని జెడ్‌ లగ్జరీ రెసిడెన్సీ హోటల్‌ పై సర్వీస్‌(ఎస్‌ఎస్‌) అధికారులు జరిపిన ఆకస్మిక దాడిలో ముగ్గురి మహిళలను కాపాడారు. అరోపణలు ఎదుర్కొంటున్న  వ్యక్తిని పోలీసులు ఘటన స్థలంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజేశ్‌ కుమార్‌ లాల్‌ తో పాటు మరో మహిళ కూడా సెక్స్ రాకెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు కనుగొన్నారు.

ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను విక్రయించినట్లు తెలుసుకొని పోలీసులు ప్రొడక్షన్ మేనేజర్ ని అలాగే జరీనా అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో 80వేలకు పైగా కస్టమర్స్ కి విక్రయిస్తున్నట్లు తేలింది. ఇక కేసులో కీలక నిందితురాలు జరీనా అని పోలీసులు నిర్దారించారు. ఇరువురిపై  మనసుల అక్రమ రవాణా నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.