కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు తమ వంతుగా సాయం చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ అందరికంటే ఎక్కువగా 25 కోట్ల రూపాయల విరాళం ప్రకటించాడు. అంతేకాదు తరువాత మరో 3 కోట్ల రూపాయలు వైధ్య సిబ్బంది కోసం ఇచ్చాడు. దీంతో అక్షయ్‌ కుమార్‌ గురించి సోషల్ మీడియాలో భారీగా చర్చ మొదలైంది.

దీంతో అక్షయ్‌ కు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. గతంలో అక్షయ్‌ పలు ఇంటర్య్వూలో చెప్పిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. షూటింగ్ ఉన్నా లేకపోయినా అక్షయ్‌ దిన చర్య ఉదయం 4 గంటలకే ప్రారంభమవుతుంది. మధ్యం, దూమపానం అలవాటు లేదు. సాయంత్రం ఆరు దాటిన తరువాత షూటింగ్ చేయడు. రాత్రి పది గంటలలోపే నిద్రపోతాడు. మళ్లీ ఉదయం 4 గంటలకు లేచి వర్క్‌ అవుట్ చేస్తాడు.

గతంలో కపిల్‌ శర్మ కామెడీ నైట్స్ కార్యక్రమంలో పాల్గొన్ణ అక్షయ్ మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. తన నెలవారి ఖర్చు కేవలం 10 వేల రూపాయలు మాత్రమే నట. ఒకవేళ ఏదైనా అకేషన్‌ ఉన్నా ఆ నెల మరో రెండు మూడు వేలు మాత్రమే ఎక్కువ ఖర్చు చేస్తాడట. సాధారణంగా స్టార్ హీరో మెయిన్‌టెనెన్స్ అంటే లక్షల్లో వ్యవహారం. అలాంటి అక్షయ్‌ లాంటి బిజీ హీరో నెలంతా 10 వేలతోనే గడిపేస్తున్నాడంటే చాలా గొప్పవిషయం అంటున్నారు విశ్లేషకులు.