కరోనా కారణం ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా సినీ రంగం మీద కరోనా ప్రభావం చాలా ఎక్కవుగా ఉంది. సినిమాలకు సంబంధించిన యాక్టివిటీ పూర్తిగా ఆగిపోవటంతో ఎలాంటి అప్‌డేట్స్ లేక సినీ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. దీంతో ఫ్రెష్‌ న్యూస్‌ లేకపోవటంతో పాత వార్తలను మరోసారి నెమరు వేసుకుంటున్నారు. ఒకప్పుడు సంచలనంగా మారిన చాలా వార్తలను ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

అలా మరోసారి తెర మీదకు వచ్చిన ఒకప్పటి సెన్సేషనల్ వార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి నిర్మాత హీరోల అన్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ తొలి నాళ్ల నుంచి నిర్మాతల శ్రేయస్సుకోసం ఎంతో ఆలోచించేవాడు. అందుకే ఆయన ఎప్పుడూ సినిమా పూర్తయిన తరువాత పూర్తి పేమెంట్ తీసుకునేవాడు. దీంతో నిర్మాతలు మెగాస్టార్‌తో వరుసగా సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చేవారు.

మెగాస్టార్ చేస్తున్న పనితో చాలా మంది నిర్మాతలు ఇతర హీరోలను కూడా అలాగే సహకరించాలని కోరేవారు. ఈ ప్రభావం బాలీవుడ్‌ ఇండస్ట్రీ మీద కూడా పడింది. అప్పట్లో కొంత మంది బాలీవుడ్ నిర్మాతలు కూడా హీరోలను సినిమా పూర్తయిన తరువాత పేమెంట్ తీసుకోవాలని కోరారు. దీంతో అప్పటి బాలీవుడ్‌ స్టార్ హీరో జితేంద్ర తన చిరంజీవికి వార్నింగ్ ఇచ్చాడట. నువ్వు ముందుగా పేమెంట్ తీసుకోకుండా సినిమా పూర్తయిన తరువాత పేమెంట్‌ తీసుకోవాలని సూచించాడట.

ఇలా సినిమా పూర్తయిన తరువాత పేమెంట్ తీసుకుంటే అప్పుడు నిర్మాత డబ్బులు ఎగ్గొడితే ఏం చేస్తావ్ అని అడిగాడట. అయితే జితేంద్ర చెప్పినా చిరు మాత్రం తన పద్దతి మార్చుకోలేదు., ఎప్పుడూ నిర్మాతల మంచి గురించి ఆలోచించే మెగాస్టార్‌, ఇప్పుడు కూడా సినిమా షూటింగ్ పూర్తయిన తరువాతే పేమెంట్ తీసుకునే అలవాటును కొనసాగిస్తున్నాడు.