కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు. బిగిల్ 300కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడంతో నేషనల్ లెవెల్లో అన్ని ఇండస్ట్రీలను ఆకర్షించాడు. మొదటి సినిమా రాజా రాణా నుంచి బిగిల్ వరకు వరుసగా నాలుగు బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నాడు. తేరి - మెర్శల్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇకపోతే నెక్స్ట్ ఈ యువ దర్శకుడు ఎలాంటి సినిమా చేస్తాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. షారుక్ ఖాన్ తో ఆల్ మోస్ట్ సెట్టయ్యింది గాని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడాల్సి ఉంది.. డిసెంబర్ లో ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ విషయంలో బాహుబలి రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ కూడా ఇన్వాల్వ్ కాబోతున్నట్లు సమాచారం.

read also: నష్టాలతో దెబ్బకొట్టిన మన స్టార్ హీరోల సినిమాలు.. లాస్ ఎంత?

గతంలో దర్శకుడు అట్లీ మెర్శల్ స్క్రీన్ ప్లే కోసం బాహుబలి రచయిత సహాయం తీసుకున్నాడు. కొన్ని ఎపిసోడ్స్ విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడడంతో విజయేంద్రప్రసాద్ తన పెన్నుకీ పదనుపెట్టి సాయం చేశారు. ఆ ఫార్ములా సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని దర్శకుడు అట్లీ చాలా సార్లు మీడియాకు చెప్పాడు.

ఇక మరోసారి స్క్రీన్ ప్లే విషయంలో అట్లీ విజయేంద్ర ప్రసాద్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. షారుక్ తో చేయనున్న సినిమాకు సంఖి అనే టైటిల్ ని సెట్ చేసినట్లు టాక్ వైరల్ అయినా విషయం తెలిసిందే.  ఇక అట్లీ ప్రాజెక్ట్ తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని షారుక్ ఫిట్ నెస్ లో కూడా కొన్ని మార్పులు చేయడానికి సిద్దమవుతున్నాడట.

గత కొంత కాలంగా వరుస అపజయాలని ఎదుర్కొంటున్న షారుక్ దాదాపు సినిమాలకు దూరమవుతున్నారు అన్నట్లు పలు కథనాలు అభిమానులను షాక్ ఇచ్చాయి. ఇక ఇప్పుడు అట్లీతో కొత్త సినిమా చేయడానికి సిద్దమవుతుండడంతో ఒక్కసారిగా ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. మరి ఆ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.