బాలీవుడ్ లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 13 నడుస్తోంది. ఇప్పటికే సెంచరీ ఎపిసోడ్లను పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇది ఇలా ఉండగా.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా 'ఛపాక్' బృందం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ తో పాటు హీరోయిన్ దీపికా పదుకోన్, హీరో విక్రాంత్ మాస్సే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇంటి సభ్యులతో కలిసి సందడి చేసిన వీరు బిగ్ బాస్ కంటెస్టంట్ లు వారి జీవితంలో ఎదుర్కొన్న చేదు ఘటనలను పంచుకోవాలని కోరారు. దీంతో ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా వారికి జరిగిన సంఘటనలను చెబుతూ విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టంట్ ఆర్తి సింగ్ తనకు చిన్నవయసులో ఎదురైన ఓ అనుభవాన్ని షేర్ చేస్తూ ఏడ్చేసింది.

'పండగపూట ఏమిటీ దరిద్రం...' సమంత డ్రెస్ పై ఘోరంగా ట్రోల్స్!

తనకు పదమూడేళ్ల వయసులో.. ఓరోజు ఇంట్లో మధ్యాహ్నం మూడింటి సమయంలో నిద్రపోతున్నప్పుడు తన ఇంట్లో పనిచేసే వ్యక్తి తనపై అత్యాచారానికి ప్రయత్నించిన విషయాన్ని వెల్లడించింది. ఆ సంఘటనతో భయపడిపోయిన తాను వెంటనే గట్టిగా కేకలు వేసి.. అతడి బట్టలు చింపడంతో.. అతడు భయపడి రెండో అంతస్తు నుండి దూకి పారిపోయాడని చెప్పుకొచ్చింది.

అలా తనను తాను కాపాడుకున్నానని.. కానీ ఈ ఘటన కారణంగా ఎంతో కుంగిపోయానని.. అలాంటి మానసిక పరిస్థితి నుండి బయటపడడానికి తన తల్లి, సోదరుడు ఎంతో కృషి చేశారని.. ఇప్పటికీ ఆ ఘటన తలచుకుంటే చేతులు వణుకుతాయని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని సరైన వేదికపైనే మాట్లాడాలనుకున్నానని.. దాని వలన చెప్పాలనుకున్న విషయం ఎక్కువ మంది మహిళలకు చేరువవుతుందని చెప్పుకొచ్చింది. మహిళలు తమపై జరిగే దాడులపై తప్పనిసరిగా నోరు విప్పాలని కోరింది.