Asianet News TeluguAsianet News Telugu

'భీష్మ' యూఎస్ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి..?

ఈ నేపథ్యంలో వచ్చిన 'భీష్మ' పరిస్థితి ఎలా వుంటుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.ఈ నేపధ్యంలో అమెరికాలో ఈ చిత్రం కలెక్షన్స్ పరిస్దితి ఎలా ఉంది..అక్కడ కూడా దుమ్ము దులుపుతోందా లేదా అన్నది చూద్దాం.
 

Bheeshma US Collections Status
Author
Hyderabad, First Published Feb 25, 2020, 9:51 AM IST

ఫన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి హాలిడే రోజున రిలీజ్ అయ్యి..తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.  ఓపెనింగ్స్ కొంచం స్లో గా మొదలు అయినా మ్యాట్నీ షోల నుండి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాంపేజ్ ని చూపెడుతూ దూసుకు పోతోంది.

ఇది చిత్రం టీమ్ కు,హీరోకు,నిర్మాతకు మంచి ఆనందం కలిగిస్తోంది. అయితే రీసెంట్ గా యూఎస్ లో విడుదలైన 'జాను'.. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు రెండూ ప్రేమకథ నేపథ్యంలో సాగినవే. అయితే ఆ రెండు సినిమాలను కూడా యూఎస్ ఆడియన్స్ పట్టించుకోలేదు. బాగా నెగిటివ్ టాక్ వచ్చేసింది. దాంతో అక్కడ ఆ  రెండు సినిమాలు వసూళ్లపరంగా పూర్తిగా నిరాశపరిచాయి.

'అశ్వద్ధామ' వివాదం : దారుణం,పద్దతి కాదంటూ ఘాటుగా మెహ్రీన్!

ఈ నేపథ్యంలో వచ్చిన 'భీష్మ' పరిస్థితి ఎలా వుంటుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.ఈ నేపధ్యంలో అమెరికాలో ఈ చిత్రం కలెక్షన్స్ పరిస్దితి ఎలా ఉంది..అక్కడ కూడా దుమ్ము దులుపుతోందా లేదా అన్నది చూద్దాం.

మొదట ఈ సినిమా ప్రీమియర్లకుపెద్దగా రెస్పాన్స్ రాకపోయినా సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో కలెక్షన్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రీమియర్లతో పోలిస్తే శుక్రవారం వసూళ్లు 60 శాతం పెరగగా శనివారం 83 శాతం, ఆ తర్వాత వంద శాతం పెరిగి వీకెండ్ లో సినిమా సూపర్ హిట్ గా మారటం గమనార్హం. అలా మెల్లిమెల్లిగా 'భీష్మ' యూఎస్ లో విజయవిహారం చేయటం మొదలెట్టింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నిన్నటి నుంచే ఈ సినిమా అక్కడ లాభాల బాట పట్టింది. 'అ ఆ' తరువాత అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా 'భీష్మ' నిలిచే అవకాశాలు ఎక్కువనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ సినిమా నితిన్ కు బెస్ట్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు సొంతం చేసుకుంది. ఇక ఇదే జోరు వీకెండ్ మొత్తం కొనసాగి  బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బిజినెస్ లో సగానికి పైగా రికవరీ ని సొంతం చేసుకుంది. చాలా రోజుల నుంచి ఓ మంచి సినిమా కోసం చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి మంచి ఎంటర్టైనర్ దొరికింది, అలాగే మార్కెట్ లేమీ సినిమాలేవీ లేకపోయావడం వలన ఫుల్ థియేటర్స్ దొరికాయి.

పీడీవీ ప్రసాద్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.  మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాని ఫిబ్రవరి 21న రిలీజ్ చేసారు.  

Follow Us:
Download App:
  • android
  • ios