Asianet News TeluguAsianet News Telugu

నితిన్ 'భీష్మ' చిత్రానికి కష్టం.. కేటీఆర్ కు ఫిర్యాదు చేసిన డైరెక్టర్!

నితిన్ నటించిన భీష్మ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అలాంటప్పుడు ఆ చిత్రానికి కష్టం ఏంటని అనుకుంటున్నారా.. అవును నితిన్ భీష్మ చిత్రానికి కష్టం పైరసీ రూపంలో వచ్చింది.

bheeshma movie piracy in Telangana RTC bus
Author
Hyderabad, First Published Feb 27, 2020, 8:56 PM IST

నితిన్ నటించిన భీష్మ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అలాంటప్పుడు ఆ చిత్రానికి కష్టం ఏంటని అనుకుంటున్నారా.. అవును నితిన్ భీష్మ చిత్రానికి కష్టం పైరసీ రూపంలో వచ్చింది. టాలీవుడ్ చిత్రాలకు పైరసీ పెను భూతంలా మరీనా సంగతి తెలిసిందే. 

సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ లింకులు ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక బాధ్యతాయుతంగా మెలగాల్సిన తెలంగాణ ఆర్టీసీ సంస్థలోనే భీష్మ చిత్ర పైరసీ ప్రత్యక్షమయ్యింది. గత వారం భీష్మ చిత్రం రిలీజైన సంగతి తెలిసిందే. భీష్మ చిత్ర పైరసీని ఓ ఆర్టీసీ లగ్జరీ బస్సులో ప్లే చేశారు. దీనితో ఓ ప్రయాణికుడు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ దృష్టికి తీసుకువచ్చాడు. 

ఇది చూసిన చిత్ర దర్శకుడు వెంకీ కుడుములు షాకయ్యాడు. ఆర్టీసీ లాంటి సంస్థలో పైరసీ ప్రదర్శించడం బాధాకరం అని వెంకీ కుడుములు అన్నాడు. దీనితో వెంకీ కుడుముల ఈ సంగతిని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాడు. మాకు ఏ కష్టం వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చే ఐడి కేటీఆర్ గారిది అని వెంకీ కామెంట్ చేశాడు. 

నితిన్ కోసం వస్తున్న మెగా హీరో.. క్రేజీ న్యూస్!

వెంకీ కుడుముల ట్వీట్ చేసిన కొంత సమయానికి తెలంగాణ పోలీసులు స్పందించారు. బస్సు వివరాలు అడిగి తెలుసుకుని చర్యలు మొదలు పెట్టారు. ఇలాంటి పైరసీలు ఎక్కడ కనిపించినా తమ దృష్టికి తీసుకురావాలని వెంకీ కుడుముల అభిమానులని కోరాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios