Asianet News TeluguAsianet News Telugu

నేను అందరితో ఇమడలేను.. గెటప్ చూసి సర్జరీ అంటున్నారు.. బాలయ్య!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Balakrishna Speech at Balakrishna's Ruler Prerelease Event
Author
Hyderabad, First Published Dec 14, 2019, 10:30 PM IST

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం రోజు వైజాగ్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు.    

వైభవంగా జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో బాలయ్య తన ప్రసంగంతో అభిమానులని సంతోషపరిచారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. తాను తన సినీ జీవితంలో వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ ముందుకు సాగుతున్నాను. నాన్నగారు సినిమాల పరంగా, రాజకీయాల్లో ఎలాంటి ప్రయోగం చేసినా ఆదరించారు. నేను కూడా సినిమాల్లో ప్రయోగాలు చేస్తున్నా. ఆదిత్య 369, మంగమ్మగారి మనవడు, లెజెండ్ లాంటి వైవిధ్యభరితమైన చిత్రాలు చేశా. ఆ చిత్రాలన్నింటినీ మీరు అందరించారు. 

జైసింహా చిత్రం మంచి ఫలితాన్ని అందించింది. అదే స్పూర్తితో నేను, కేఎస్ రవికుమార్, సి కళ్యాణ్ గారు రూలర్ చిత్రంతో మీ ముందుకు రాబోతున్నాం. రూలర్ చిత్రం మీ అంచనాలకు తగ్గకుండా ఉంటుంది. ఇక చిత్రం విజయం సాధిస్తుందా లేదా అనే నాడి నాకు ముందే తెలిసిపోతుంది. రూలర్ హిట్ గ్యారెంటీ అని బాలయ్య అన్నారు. 

నేను అందరితో ఇమడలేను. అందుకే కళ్యాణ్ గారిని నిర్మాతగా ఎంచుకున్నా. మధ్యలో బాలయ్య ప్రసంగిస్తూ తెలుగు భాష ప్రస్తావన తీసుకువచ్చారు. తెలుగుని మనం రక్షించుకోవాలి. దేశభాషలందు తెలుగు లెస్స అనే పద్యం బాలయ్య చెప్పగానే అభిమానులంతా ఈలలు, కేకలు వేశారు. 

రూలర్ ప్రీరిలీజ్: బాలయ్య చిన్నప్పటి నుంచే.. చంద్రబాబుపై రాజశేఖర్ కామెంట్

దర్శకుడు రవికుమార్, నాది ఒకే మనస్తత్వం. ఈ చిత్రంలో నానా రెండు పాత్రల్లో వైవిధ్యం ఉంటుంది. నానా గెటప్పులు చూసి సర్జరీ చేయించుకున్నానని కొందరు అనుకుంటున్నారు. అలా అనుకునే వారికి నేను సమాధానం చెప్పనవసరం లేదు. నా సినిమా గెటప్ లీక్ అయినా, డైలాగ్ లీక్ అయినా నాకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే నా చిత్రాలని బయట చూసినప్పటికీ మళ్ళీ థియేటర్స్ లో తప్పకుండా చూస్తారు. 

రూలర్ ప్రీరిలీజ్:రజనీని దేవుడిని చేసింది ఆయనే.. రైతుల కోసం బాలయ్య అడిగిమరీ..

లెజెండ్ చిత్రాన్ని వైజాగ్ లో బహిరంగ ప్రదేశంలో చిత్రీకరించాం. ప్రజలంతా షూటింగ్ చూసారు. కానీ ఆ చిత్రం థియేటర్ లో మూడేళ్లు ఆడింది అని బాలయ్య గుర్తు చేసుకున్నారు. రూలర్ చిత్రానికి పనిచేసిన నటీనటులకు,సాంకేతిక నిపుణులకు బాలయ్య కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగాన్ని ముగించారు. 

రూలర్ ప్రీరిలీజ్: దానవీరశూర కర్ణ.. బాలయ్య కోసం వెయిటింగ్!

Follow Us:
Download App:
  • android
  • ios