Asianet News TeluguAsianet News Telugu

‘హిరణ్యకశ్యప’కి రానా కండీషన్, గుణ ఓకే..?

ఈ సినిమాకు విఎఫ్ ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడరాదని, అలా చేస్తే నవ్వులు పాలు అవుతామని చెప్పారట. అలాగే బాహుబలి కు పనిచేసిన విఎఫ్ ఎక్స్ టీమ్ తో మాట్లాడతానని, అది ఓకే అంటే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది అన్నట్లుగా సూచించారట

Baahubali VFX Director for Rana's  Hiranyakashyap
Author
Hyderabad, First Published Jan 17, 2020, 11:05 AM IST

అనుష్క, అల్లు అర్జున్ కాంబోలో రూపొందించిన  ‘రుద్రమదేవి’ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్, హీరో రానా కాంబినేషన్ లో రాబోతున్న  ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘హిరణ్యకశ్యప’.దాదాపు 130 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పౌరాణిక గాథను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి గుణశేఖర్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై పనిచేస్తున్న గుణ శేఖర్ కు రానా ఓ కండీషన్ పెట్టారట. దానికి మారు మాట్లాడకుండా ఓకే అనేసారట గుణ శేఖర్.

అదేమిటంటే...ఈ సినిమాకు విఎఫ్ ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడరాదని, అలా చేస్తే నవ్వులు పాలు అవుతామని చెప్పారట. అలాగే బాహుబలి కు పనిచేసిన విఎఫ్ ఎక్స్ టీమ్ తో మాట్లాడతానని, అది ఓకే అంటే ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది అన్నట్లుగా సూచించారట.

క్యూట్ గా ఉండే కలర్స్ స్వాతి.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది!

ఈ సినిమాకు కీలకమైన విఎఫ్ ఎక్స్ విషయంలో రానా చూపిన శ్రద్దకు మురిసిపోయిన గుణశేఖర్...వెంటనే ఆ ప్రపోజల్ కు ఓకే చెప్పేసారట. దాంతో బాహుబలికు పనిచేసిన విఎప్ ఎక్స్ డైరక్టర్ కమల్ కన్నన్ ని పిలిచి భాధ్యతలు అప్పగించారని సమాచారం. ప్రస్తుతం రానా చేస్తున్న విరాట పర్వం పూర్తవగానే ఈ సినిమా షూట్ మొదలుకానుంది. ఈ వేసవిలో ముహూర్తం షాట్ తో మొదలెట్టనున్నారు.

‘భక్త ప్రహ్లాద’ కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని అతని తండ్రి ‘హిరణ్యకశ్యప’ కోణంలో ఆవిష్కరించనున్నాడట గుణశేఖర్.  టైటిల్ రోల్‌లో మహా రాక్షసుడు హిరణ్యకశ్యపునిగా మెప్పించేందుకు ఆహార్యం, వాచికం విషయంలో ఇప్పటికే రానా  ప్రత్యేక కసరత్తు చేస్తున్నారట. విజువల్‌గా ఈ మైథలాజికల్ మూవీని అద్భుతంగా తీర్చిదిద్దడానికి వి.ఎఫ్.ఎక్స్ డైరక్టర్ తో  గుణశేఖర్ చర్చలు జరిపి అన్ని విధాలుగా రెడీ చేసారట.
 

Follow Us:
Download App:
  • android
  • ios