నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన సినిమా ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రష్మికా మందన్న నాయిక. ఫిబ్రవరి 21న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో ఓ సన్నివేశం మహేష్ ఆల్ టైమ్ హిట్ అతడులోని సీన్ ని గుర్తు చేస్తుందని అంటున్నారు. ఆ విషయం స్వయంగా నితిన్ చెప్తున్నారు.

ఆ సీన్ గురించి...  మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’లోని పొలం ఫైట్ చాలా ఫేమస్. ఇప్పటికీ అభిమానులు దాన్ని గుర్తు చేసుకుంటారు. అలాంటి ల్యాండ్ మార్క్ సీన్ ని ను దగ్గర పెట్టుకుని , దాని స్ఫూర్తితో నితిన్ తాజా చిత్రం భీష్మలో సీన్ తీసారు. ఆ విషయం నితిన్ స్వయంగా ఖరారు చేసారు మీడియా దగ్గర. నితిన్ మాట్లాడుతూ...మీరనుకుంటున్నది కరక్టే. ‘అతడు’లోని పొలం ఫైట్ ను దృష్టిలో ఉంచుకొనే దాన్ని తీశాం. అది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది అన్నారు.

అలాగే తన పాత్ర గురించి నితిన్ చెప్తూ... “నేను మీమ్స్ క్రియేట్ చేసే క్యారెక్టర్ చేశాను. అందుకే ‘భీష్మ’లో ప్రతి సీనూ ఫన్నీగా ఉంటుంది. విలన్ కు వార్నింగ్ ఇవ్వడంలోనూ ఆ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది. మంచి రోల్” అని చెప్పారు నితిన్.  ‘భీష్మ’ ఎలా ఉంటుందంటే...‘దిల్’ తర్వాత నేను చేసిన లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్. యాక్షన్ కూడా మిళితమై ఉంటుంది. ఇందులో ఆర్గానిక్ వ్యవసాయం అనేది ప్రధానాంశం కాదు.అది కథలో ఒక ఎలిమెంట్ మాత్రమే. భీష్మ ఆర్గానిక్స్ అనే కంపెనీ ఉంటుంది. అందులో నేనొక ఉద్యోగిని. ఆర్గానికి ఫార్మింగ్ అంటే దాని గురించిన సినిమా అని అంటారేమోనని దాన్ని ప్రమోషన్స్లో ఎలివేట్ చెయ్యలేదు అన్నారు నితిన్.