అర్జున్ రెడ్డి సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ వంగ అదే కథను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తెరకేక్కించి తన క్రేజ్ ని మరింత పెంచుకున్నాడు. అయితే తన తదుపరి సినిమాని కూడా ఈ దర్శకుడు బాలీవుడ్ లోనే రూపొందించే అవకాశం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

రణ్ వీర్ కూడా ఒక థ్రిల్లర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అఫీషియల్ ఎనౌన్సమెంట్ కూడా వచ్చింది.  సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. ఫుల్ స్క్రిప్ట్ విన్న తరువాత హీరో సినిమా చేయడానికి ఒప్పుకోలేదని రూమర్స్ వచ్చాయి. ఇక చేసేదేమి లేక సందీప్ నెక్స్ట్ టాలీవుడ్ లోనే మరో సినిమా చేయాలనీ సొంత గూటికి చేరినట్లు తెలుస్తోంది.

యువీ క్రియేషన్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. సందీప్ తన నెక్స్ట్ సినిమాని ప్రభాస్ తో చేసే అవకాశం ఉందట. సస్పెన్స్ తో కూడిన ఒక థ్రిల్లర్ కథను సెట్ చేసుకున్న సందీప్ ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.