Asianet News TeluguAsianet News Telugu

నోట్ల రద్దుపై అనురాగ్ కశ్యప్ సెటైర్ 'చోక్డ్' (రివ్యూ)

నోట్ల రద్దు మధ్య తరగతి జీవితాలపై ఏ స్దాయి ప్రభావం చూపించిందో మనందరికీ తెలుసు. నోట్ల రద్దు సమయంలో అనేక మంది ఈ కాన్సెప్టు తో సినిమాలు చేయటానికి ప్రయత్నించారు. అయితే చాలా వరకూ స్క్రిప్టు స్దాయిలోనే ఆగిపోయాయి. జనం కూడా ఆ విషయం మర్చిపోయి తిరిగి జీవితంలో పడిపోయారు. కానీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాత్రం దాన్ని మర్చిపోలేకున్నారు. తనదైన శైలిలో ఓ స్క్రిప్టు రాసి తెరకెక్కించారు. నోట్ల రద్దుపై వ్యంగ్యంగా సాగే ఈ సినిమా మనకీ అప్పటి పరిస్దితులను గుర్తు చేస్తుందనటంలో సందేహం లేదు. ఇంతకాలం తర్వాత తెరకెక్కిన ఆ కాన్సెప్టు...ఏ విధంగా మనకు నచ్చే విధంగా రెడీ చేసారు. నోట్ల రద్దు నేపధ్యంలో చెప్పబడ్డ ఆ కథేంటి..ఏ మేరకు మనకు నచ్చే అవకాసం ఉంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Anurag Kashyap Choked Review
Author
Hyderabad, First Published Jun 5, 2020, 6:31 PM IST

నోట్ల రద్దు మధ్య తరగతి జీవితాలపై ఏ స్దాయి ప్రభావం చూపించిందో మనందరికీ తెలుసు. నోట్ల రద్దు సమయంలో అనేక మంది ఈ కాన్సెప్టు తో సినిమాలు చేయటానికి ప్రయత్నించారు. అయితే చాలా వరకూ స్క్రిప్టు స్దాయిలోనే ఆగిపోయాయి. జనం కూడా ఆ విషయం మర్చిపోయి తిరిగి జీవితంలో పడిపోయారు. కానీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాత్రం దాన్ని మర్చిపోలేకున్నారు. తనదైన శైలిలో ఓ స్క్రిప్టు రాసి తెరకెక్కించారు. నోట్ల రద్దుపై వ్యంగ్యంగా సాగే ఈ సినిమా మనకీ అప్పటి పరిస్దితులను గుర్తు చేస్తుందనటంలో సందేహం లేదు. ఇంతకాలం తర్వాత తెరకెక్కిన ఆ కాన్సెప్టు...ఏ విధంగా మనకు నచ్చే విధంగా రెడీ చేసారు. నోట్ల రద్దు నేపధ్యంలో చెప్పబడ్డ ఆ కథేంటి..ఏ మేరకు మనకు నచ్చే అవకాసం ఉంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి
సరిత (సయామీ ఖేర్) మిడిల్ క్లాస్ మహిళ. ఆర్దిక రాజధాని ముంబైలో ఆర్దికంగా ఇబ్బందులు పడుతూంటుంది. చేసేది అక్కడ లోకల్ కోపరేటివ్  బ్యాంక్ లో క్యాషీయర్ జాబ్ ...కళ్ల ఎదురుగా డబ్బు కానీ..అవసరానికి అర్ద రూపాయి కి కూడా వెతుక్కోవాల్సిన పరిస్దితి. ఎప్పటికైనా ఈ కష్టాలు నుంచి బయిటపడగలమా అని తన నిరుద్యోగి భర్తతో, తన చిన్న కొడుకుతో బాధపడుతూ బ్రతుకు ఈడుస్తూంటుంది. అయితే ఆమె అదృష్టం తిరగబడే రోజు వచ్చింది.  ఓ రోజు రాత్రి  ఆమె కొన్ని కరెన్సీ కట్టలను కిచెన్ సింక్ పైప్ లో కనుక్కుంటుంది. అలా టైట్ గా ప్లాస్టిక్ కవర్ తో కట్టలుగా కట్టిన డబ్బు  ప్రతీ రోజు కనపడుతుంది. 

ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుందో ఆమె కనక్కోలేకపోతుంది. కానీ ఆ డబ్బు మాత్రం ఆమెలో దాగి ఉన్న అనేక కోరకలను కనుక్కుని వెలికితీస్తుంది. హఠాత్తుగా వచ్చిన ఈ డబ్బుతో తన భర్త అప్పులు తీర్చేస్తుంది. వెడ్డింగ్ గిప్ట్ కొంటుంది. కొత్త కుషన్ కవర్లు కొంటుంది. ఇంకా చాలా చేసేస్తుంది. చేయాలనుకుంటుంది. అయితే అన్ని రోజులు మనవి కావు. నవంబర్ 8,2016న ప్రకటన వచ్చింది. నోట్లు రద్దు చేసేసారు. తన దగ్గర ఉన్న డబ్బు చెల్లుతుందా. ప్రతీదీ లెక్క చెప్పి మార్చుకోవాలా...

అక్కడ నుంచి ఆ డబ్బు ఆమె క్యారక్టర్ కు టెస్ట్ గా మారుతుంది. నడమంత్రపు సిరిని తట్టుకోవటం కష్టం. అనేక సుఖాలతో పాటు చెప్పలేని సమస్యలు తెచ్చిపెడుతుంది. అలా ఓ స్ట్రగులింగ్ మ్యుజిషీయన్  సుశాంత్ (రోష‌న్ మాథ్యూ) ని ఆమె జీవితంలోకి తీసుకువస్తుంది. అక్కడ నుంచి ఆమె జీవితంలో ఏ మలుపులు తిరిగింది. అసలు ఆ డబ్బు ఎవరిది..ఆ సింక్ లోకి ఎలా వచ్చింది..నోట్ల రద్దు ప్రభావం ఆమె జీవితంపై ప్రభావం ఎలా చూపించింది.చివరకు ఆమె జీవితం లో ఏ మార్పులు వచ్చాయి..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
డైరక్టర్ అనురాగ్ కశ్యప్ గురించి కొత్తగా చెప్పేదేముంది. సామాజిక కోణంలో సినిమాలను తెరకెక్కింస్తూండీ దర్శకుడు. వ్యక్తిగతంగానూ అలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయ అంశాలపై అనురాగ్‌ స్పందించే తీరు వివాదాస్పదమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలోనూ ప్రధాని మోడీపై చాలా వ్యంగ్య బాణాలు కనపడతాయి.  సినిమాల విషయానికి వస్తే.. ఎంత చిన్న విషయాన్ని అయినా ఎంతో ప్రభావవంతంగా చెప్పగలరు. ఎక్కడా పట్టుతప్పని స్క్రీన్ ప్లే తో కళ్లు తిప్పుకోనివ్వరు. ఓ ప్రక్కన వ్యవస్దపై సెటైర్స్ వేస్తూనే, థ్రిల్లింగ్ గా కథని నడిపించేస్తూంటాడు. నోట్ల రద్దు అనే ఎలిమెంట్ ని తీసుకుని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ని మన ముందుంచారు. ముంబై జీవితాన్ని మినియోచర్ లో చూపించినట్లు చూపించేస్తారు.ప్రక్క వాళ్లపై గాసిప్ లు, చిన్న చిన్న స్ట్రగుల్స్ సినిమాని లైవ్ లీ గా మార్చేసాయి. 

అలాగే భార్య,భర్తల మధ్య గొడవల మధ్యలో పిల్లల పరిస్దితిని మనకు మన ఇళ్లను గుర్తు చేస్తాయి. ఇక ఇన్నాళ్లూ గ్లామర్ రోల్స్ లో కనిపించి సయామీ ఖేర్ ..మిడిల్ క్లాస్ గృహిణిగా చాలా బాగా చేసింది. మొత్తం ఆమె భుజాలపై నడిపింది. మిగతా పాత్రధారులు ఆమెకు కావాల్సినంత సపోర్ట్ ఇచ్చారు. అయితే బాంబే వెల్వెట్, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ వంటి సినిమాలు సృజించిన అనురాగ్ కశ్యప్ లాంటి క్లాస్ వన్ డైరక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేయం. ఓ సీనియర్ దర్శకుడుగా సినిమాలో కావాల్సిన డ్రామా, అవసరమైన చోట ట్విస్ట్ లు ఇచ్చి నడిపించారు. సెటైర్స్ తో సాగే డైలాగ్స్ బాగున్నాయి. టెక్నికల్ గా  కెమెరా వర్క్ చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ కు ప్రాణం పోసింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

 ఫైనల్ ధాట్

నోట్లు ..రద్దైనా  క్యాష్ అవుతాయి..కొన్ని ఇష్యూలు కాలం గడిచినా క్యాష్ అవ్వుతాయి
  
 Rating:3
---సూర్య ప్రకాష్ జోస్యుల
 

Follow Us:
Download App:
  • android
  • ios