బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ పై మీటూ ఆరోపణలు వస్తున్నాయి. అనుమాలిక్ తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ సోనా మొహాపాత్రా, శ్వేతా పండిట్ లాంటి సింగర్స్ ఆరోపణలు చేశారు. ఇటీవల మరో సింగర్ నేహా భాసిన్ కూడా అనుమాలిక్ పై ఆరోపణలు చేసింది. 

అతడు కామాంధుడని తనను వేధింపులకు గురి చేశాడని నేహా భాసిన్ కామెంట్స్ చేసింది. అయితే హేమా సర్దేశాయ్ లాంటి సింగర్స్ అను మాలిక్ అలాంటి వ్యక్తి కాదని సపోర్ట్ చేశారు. తాజాగా ఈ విషయాలపై అను మాలిక్ స్పందించాడు. 

'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌' రివ్యూ

తను ఎలాంటి తప్పు చేయలేదని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. గత ఏడాది కాలంగా తను చేయని తప్పుకి నిందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.. నిజం దానంతటదే బయటపడుతుందని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని.. కానీ తన మౌనాన్ని చేతకానితనంగా తీసుకుంటున్నారని అందుకే స్పందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆరోపణల కారణంగా తన పేరు ప్రఖ్యాతలకు భంగం కలుగుతోందని.. తనని, తన కుటుంబసభ్యులను మానసిక వేదనకి గురి చేస్తున్నారని.. ఈ వయసులో ఇలాంటి నిందలు పడుతున్నందుకు సిగ్గుగా ఉందని అన్నారు. 

ముందే ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయలేదు..? టీవీ షోలలో కనిపించినప్పుడు మాత్రమే ఇలాంటి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఇద్దరు ఆడపిల్లల తండ్రి అయిన తను తప్పుడు పనులు ఎందుకు చేస్తానని అన్నారు. సోషల్ మీడియాలో గొడవలకు ముగింపు అనేది ఉండదని.. ఇకనుండి తనపై నిందలు వేస్తే గనుక కోర్టు గడప తొక్కాల్సి ఉంటుందని చెప్పారు. 

అను మాలిక్ పెట్టిన ఈ పోస్ట్ పై స్పందించిన సింగర్ సోనా మొహాపాత్ర అతడిపై విరుచుకుపడింది. టీవీ షోలలో కనిపించే హక్కు అను మాలిక్ కి లేదని అతడు ఎవరికీ రోల్ మోడల్ కాదని.. కావాలంటే సెక్స్ రీహాబ్ సెంటర్ కి వెళ్లి నీలో ఉన్న సెక్స్ కోరికలు తగ్గించుకో అంటూ మండిపడింది. ఇద్దరు కూతుర్లకు తండ్రి అయినంత మాత్రాన మంచివాడివి కాలేవని.. కోర్టుకి వెళ్లి తేల్చుకుందాం అంటూ వార్నింగ్ ఇచ్చింది!