యువ సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ దూసుకుపోతున్నాడు. యువతకు ఆకట్టుకునే సంగీతం అందించడంలో అనిరుద్ సిద్ధహస్తుడు. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కు ఎఫైర్స్ కూడా ఎక్కువే. పార్టీల్లో పబ్బుల్లో తరచుగా రచ్చ చేయడం చూస్తూనే ఉన్నాం. 

ఇదిలా ఉండగా మూడేళ్ళ క్రితం సౌత్ లో సుచిలీక్స్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కోలీవుడ్, టాలీవుడ్ హీరోల, హీరోయిన్ల ప్రైవేట్ ఫోటోలు లీకై మీడియాలో పెద్ద హంగామానే నడిచింది. సుచిలీక్స్ బాధితుల్లో అనిరుధ్, హాట్ హీరోయిన్ ఆండ్రియా కూడా ఉన్నారు. 

వీరిద్దరూ ప్రైవేట్ గా ముద్దు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లో వీరిద్దరూ ఈ ఫోటోల గురించి స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ధైర్యంగా నిజాలు ఒప్పేసుకుంటున్నారు. ఆండ్రియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుచిలీక్స్ గురించి స్పందించింది. 

ఇంట్లోనే ఉండండి, ప్రేమని పొందండి.. కానీ గర్భం తెచ్చుకోవద్దు.. నటుడి కుమార్తె హాట్ కామెంట్స్

తామిద్దరం ముద్దు పెట్టుకున్నది వాస్తవమే అని తెలిపింది. అయినా అందులో తప్పేముంది. అప్పట్లో మేమిద్దరం రిలేషన్ లో ఉన్నాం అని చెప్పేసింది. ముద్దు పెట్టుకోవడం తప్పు కాదు. ఆ ఫోటోలు లీక్ కావడమే తప్పు అని ఆండ్రియా పేర్కొంది. ఫోటోలు లీక్ కావడంపై అనిరుద్ నాకు సారీ కూడా చెప్పాడు అని ఆండ్రియా చెప్పుకొచ్చింది. 

సుచిలీక్స్ లో భాగంగా రానా, త్రిష, ధనుష్ లాంటి ప్రముఖుల దృశ్యాలు కూడా లీక్ అయ్యాయి.