బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతుంది సుమ. టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ ఇలా ఏ కార్యక్రమమైనా సుమా ఉండాల్సిందే. ఆమె ఒక్కసారి స్టేజ్ ఎక్కి, మైక్ అందుకుంటే ఇక ఆపడం ఎవరితరం కాదు. వరుస పంచ్ డైలాగ్స్, జోక్స్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.

స్టార్ హీరోలు సైతం తమ సినిమా ఈవెంట్స్ లో సుమ ఉండాలని కోరుకుంటారు. అంతగా క్రేజ్ సంపాదించేసింది సుమ. ఇక బుల్లితెర ప్రేక్షకులైతే సుమని తమ ఇంటి అమ్మాయిగా భావిస్తారు. టాలీవుడ్ కి ఎంతమంది యాంకర్లు వస్తున్నా.. సుమని మాత్రం ఎవరూ బీట్ చేయడం లేదు.

పునర్నవి బోల్డ్ అవతారం.. వైరల్ అవుతోన్న ఫోటో!

ఇది ఇలా ఉండగా.. తాజాగా సుమ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో సుమ మేకప్ లేకుండా కనిపిస్తోంది. 'నా ఉదయాలు ఇలాగే ఉంటాయి. మేకప్ లేకుండా నా శరీరం శ్వాస తీసుకుంటోంది' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇక వీడియోలో తనకు క్యాష్ షోలో కాలేజ్ స్టూడెంట్స్ ఇచ్చిన పెయింటింగ్ ని చూపిస్తూ.. వారి అభిమానానికి థాంక్యూ చెప్పింది.

ఫ్యాన్స్ ని చూస్తుంటే వారికోసమైనా.. మేకప్ వేసుకొని కష్టపడి పని చేయాలనిపిస్తుందని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా చూశారు.

మేకప్ లేకుండా న్యాచురల్ గా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఎలా ఉన్నా.. మిమ్మల్ని యాంకరింగ్ లో ఎవరూ బీట్ చేయలేరంటూ ఆమెపై పొగడ్తలు కురిపిస్తున్నారు.