బుల్లితెర ప్రేక్షకులకు అలరించే షోలలో 'పటాస్' ఒకటి. యాంకర్ శ్రీముఖి, రవిలు కలిసి ఈ షోని రక్తి కట్టించారు. ముఖ్యంగా యూత్ కి ఈ షో బాగా కనెక్ట్ అయింది. అయితే బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న కారణంగా శ్రీముఖి ఈ షోకి బ్రేక్ ఇచ్చింది. తిరిగి చేస్తుందా..? లేదా..? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

మరోపక్క యాంకర్ రవి కూడా ఈ షోకి దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనదైన యాంకరింగ్ తో మెప్పించే రవి.. ఓ పక్క షోలు మరోపక్క ఈవెంట్ అంటూ చాలా బిజీగా గడుపుతున్నాడు. లేడీ యాంకర్లతో కలిసి రవి వేసే పంచ్ లు ఆడియన్స్ ని నవ్విస్తుంటాయి.

ప్రభాస్ వదులుకున్న సినిమాలు.. ఆ హీరోలకు బ్లాక్ బస్టర్లు

మిగిలిన షోల సంగతి పక్కన పెడితే రవికి 'పటాస్' మంచి పేరు తీసుకొచ్చింది. అలాంటిది ఈ షో నుండి రవి తప్పుకుంటున్నాడనే వార్తలు రాగానే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. రవి ఈ షో నుండి తప్పుకోవడానికి ఒక కారణం ఉందని చెబుతున్నారు.

'పటాస్' షోతో పాటు మరో శాటిలైట్ ఛానెల్ తో ఓ షో చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడట రవి. దీంతో 'పటాస్' షో నిర్వాహకులు మల్లెమాల సంస్థ అలా చేయడానికి వీలు లేదని.. 'పటాస్' షో మాత్రమే చేయాలని షరతులు పెడుతోందట. దీంతో రవి 'పటాస్' షో నుండి తప్పుకోవడానికి నిర్ణయించుకున్నాడట.

అదే విషయాన్ని యాజమాన్యానికి వెల్లడించినట్లు సమాచారం. రవి స్థానంలో యాంకర్ గా నోయెల్ లేదా.. 'జబర్దస్త్' ఫేం చంటి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. 'జబర్దస్త్' షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబు కూడా ఆ షోని తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.