బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ తన గ్లామర్‌ షోతో ఎంత పాపులర్‌ అయ్యిందో. వివాదాలతోనూ అదే స్థాయిలో వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తనపై వచ్చే నెగెటివ్‌ కామెంట్స్ విషయంలో ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతుంటుంది అనసూయ. అలాంటి వారిపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకు పడటం అనసూయకు అలవాటు. తాజాగా ఈ భామకు  మరోసారి తన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ టిక్‌ టాక్‌ వీడియోపై ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యింది.

ఇద్దరు ఆకతాయిలు రోడ్‌ మీద నడుచుకుంటూ వెళుతూ ఓ అమ్మాయికి డాష్ ఇస్తారు. అయితే వెంటనే ఆ అమ్మాయి తనకు డాష్ ఇచ్చిన అబ్బాయి  చెంప పగలగొడుతుంది. ఆ అబ్బాయి వెంటన ఉన్న యువకుల అతని చేతిలో ఉమ్మి, తరువాత ఆ అబ్బాయి ఆమెకు క్షమాపణ చెబుతున్నట్టుగా షేక్‌ హ్యాండ్ ఇస్తాడు. చేయి తడిగా ఉండటంతో ఆమె అనుమానంగా చూస్తుంది. అప్పుడు ఆ యువకుడు అది ఉమ్మి అని వెటకారంగా నవ్వుతాడు. ఇది ఆ టిక్‌ టాక్‌ వీడియోలో ఉన్న విషయం. ఇలా అమ్మాయిలను అవమానకరంగా చూపించటంపై అనసూయ ఫైర్‌ అయ్యింది.

ఆ వీడియోను తన పేజ్‌లో షేర్‌ చేసిన అనసూయ వెంటనే అతని టిక్‌ టాక్‌ అకౌంట్‌ ను తొలగించాలని ఆమె కోరింది. `ఎవరినీ తప్పు పట్టాలో అర్ధం కావటం లేదు. ఇలాంటి పనులు చేస్తున్నవారినా... లేక వారిని సమర్థించిన వారినా..?  వైరస్ లాంటి ఇలాంటి వ్యక్తులను వెంటనే దండించాలి. ఇలాంటి వారిని జైల్లో పెట్టాలి. అతడి అకౌంట్ తొలగించాలని టిక్‌టాక్‌ ఇండియాను కోరుతున్నా` అంటూ ట్వీట్ చేసింది అనసూయ. అయితే అనసూయ తొలగించాలని కోరిన అకౌంట్‌ను దాదాపు 11 లక్షల మంది ఫాలో అవుతున్నారు.