Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ డ్రగ్స్ కేసు: రెండో రోజు ఎన్సీబీ విచారణకు అనన్య పాండే.. వాట్సాప్ ఛాట్‌‌పై ప్రశ్నల వర్షం

రెండో రోజు ఎన్సీబీ (ncb)  విచారణకు హాజరయ్యారు బాలీవుడ్ (bollywood) నటి అనన్య పాండే (ananya pandey) . డ్రగ్స్ కేసుకు (drugs case) సంబంధించి అనన్యను ప్రశ్నిస్తున్నారు ఎన్సీబీ అధికారులు. నిన్న దాదాపు మూడు గంటల పాటు అనన్యను ప్రశ్నించారు . వాట్సాప్ చాట్ ఆధారంగా అనన్యపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఎన్సీబీ అధికారులు. 

Ananya Panday attend ncb enquiry for bollywood drugs case
Author
Mumbai, First Published Oct 22, 2021, 4:42 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రెండో రోజు ఎన్సీబీ (ncb)  విచారణకు హాజరయ్యారు బాలీవుడ్ (bollywood) నటి అనన్య పాండే (ananya pandey) . డ్రగ్స్ కేసుకు (drugs case) సంబంధించి అనన్యను ప్రశ్నిస్తున్నారు ఎన్సీబీ అధికారులు. నిన్న దాదాపు మూడు గంటల పాటు అనన్యను ప్రశ్నించారు . వాట్సాప్ చాట్ ఆధారంగా అనన్యపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఎన్సీబీ అధికారులు. ఆర్యన్‌తో (aryan khan) డ్రగ్స్‌కు సంబంధించి వాట్సాప్ ఛాట్ చేయలేదని అనన్య చెప్పినట్లు తెలుస్తోంది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ (mumbai cruise drug case) వ్యవహారంలో ఎన్‌సీబీ సినీనటి అనన్య పాండేను విచారించడం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆర్యన్ ఖాన్.. వాట్సాప్ ఛాట్‌లో అనన్య పేరు వెలుగులోకి రావడంతో నిన్న ఆమె ఇంట్లో ఎన్‌సీబీ అధికారులు సోదాలు జరిపారు. మరోవైపు అనన్య నుంచి ఫోన్, లాప్‌టాప్ స్వాధీనం చేసుకున్న అధికారులు... ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. 

మరోవైపు బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసుల పరంపర కొనసాగుతూనే వుంది. రెండేళ్ల క్రితం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput) ఆత్మహత్య సమయంలో ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. అప్పటి నుంచి ఎన్‌సీబీ చూపు మొత్తం బాలీవుడ్‌ సెలబ్రెటీలపైనే వుంది. తాజాగా క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసుకు సంబంధించి హీరోయిన్ అనన్య పాండే పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. రేవు పార్టీ జరుగుతున్న సమయంలో ఆర్యన్ ఖాన్.. డ్రగ్స్ కోసం ఒక నటికి వాట్సాప్ మేసేజ్ పంపినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ సమయంలో ఆర్యన్ చాట్ చేసింది అనన్య పాండేతోనే అని నిర్థారించారు ఎన్‌సీబీ అధికారులు. దీంతో అనన్య కూడా ఈ డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. 

Also Read:లైగర్ బ్యూటీ అనన్య పాండే గురించి ఐదు మైండ్ బ్లోయింగ్ డిటైల్స్...!

కాగా, బాలీవుడ్ సీనియర్ నటుడు చంకీ పాండే (chunky pandey) కూతురుగా బీటౌన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే.. ఇప్పుడొక బిజీ హీరోయిన్. 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్నీ ఔర్ వోతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ భామ ఒక హిందీ సినిమాతో పాటు తెలుగులో లైగర్‌లో (liger movie) నటిస్తోంది. హీరోయిన్‌గా ఇప్పటి వరకు ఒక్క పెద్ద హిట్టు కొట్టకపోయినా.. పార్టీలు, పబ్‌లలో మాత్రం ఈ భామా జోరు ఓ రేంజ్‌లో వుంటుంది. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహారా ఖాన్ (suhara khan) , సైఫ్ కుమార్తె సారా అలీ ఖాన్‌లు (sara ali khan) అనన్యకు మంచి స్నేహితులు. వీరంతా పార్టీలు, పబ్‌లకు వెళ్తూ వుంటారు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ పోలీసులకు పట్టుబడటంతో వీరి బాగోతమంతా బయటపడుతుండటం బీటౌన్‌లో కలకలం రేపుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios