ఆనందం, దొంగోడు లాంటి చిత్రాల్లో రేఖా వేదవ్యాస్ హీరోయిన్ గా మెరిసింది. ఈ కుర్ర భామ లుక్స్ అప్పట్లో తెలుగు యువతని బాగానే ఆకట్టుకున్నాయి. ఇటీవల రేఖా వేదవ్యాస్ టాలీవుడ్ కు దూరమైంది. కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రేఖ, ఆకాష్ జంటగా నటించిన ఆనందం చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. 

తాజాగా రేఖా వేదవ్యాస్ అలీ హోస్ట్ గా వ్యవరిస్తున్న ఓ కార్యక్రమంలో తళుక్కున మెరిసింది. ఈ కార్యక్రమంలో అలీతో రేఖ అనేక విశేషాలు పంచుకుంది. దీనికి సంబందించిన ప్రోమో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రోమో చూస్తుంటే అలీ, రేఖ మధ్య సరదాగా సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. 

ప్రోమోలో చూపిన దానిప్రకారం రేఖ మాట్లాడుతూ.. నాగార్జున మన్మథుడు చిత్రంలో చిన్న పాత్రలో నటించా. తర్వాత పూర్తి స్థాయిలో సినిమా చేద్దాం అని నాగార్జున మాట ఇచ్చారు. ఇంతవరకు ఆయన ప్రామిస్ నిలబెట్టుకోలేదు.. నాగార్జున సర్ నేను ఇంకా వైట్ చేస్తున్నా.. ఫోన్ చేయండి అని సరదాగా రేఖ వ్యాఖ్యానించింది. 

గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. షాకిస్తోన్న 'ఇడియట్' హీరోయిన్!

ఇక తాను కొన్నేళ్ల క్రితం చనిపోయినట్లు వచ్చిన పుకార్లపై స్పందించింది. ఆ పుకార్లు ఎందుకు వచ్చాయో పూర్తి షోలో రేఖ వివరించనుంది. తాను బ్రతికుండగానే పేపర్ లో శ్రద్ధాంజలి అంటూ వచ్చిన ఆర్టికల్ పై రేఖ ఫన్నీగా బదులిచ్చింది. మన శ్రద్ధాంజలిని మనమే చూసుకునే అదృష్టం ఎంతమందికి వస్తుంది. దీనిపై నేను సరదాగా ఓ పని చేస్తా. ఎవరైనా ఇంటికి వెళ్లి ఒకరోజు వారితో ఉంటా. మరుసటి రోజు ఉదయం నా శ్రద్ధాంజలి ఆర్టికల్ ని వారి టేబుల్ పై పెట్టేసి వెళ్ళిపోతా. దానిని చూసి వాళ్ళు ఎంతగా భయపడుతారో ఊహించుకోండి అంటూ రేఖ వేదవ్యాస్ ఫన్నీ కామెంట్స్ చేసింది. రేఖ వేదవ్యాస్ పూర్తి షో ఫిబ్రవరి 24న ప్రసారం కానుంది.