Asianet News TeluguAsianet News Telugu

బన్నీ బాక్స్ ఆఫీస్ మోత.. షేర్స్ లో సెంచరీ!

గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు - అల్లు అర్జున్ సినిమాలు ఒకేసారి దండయాత్ర చేయడంతో సినిమా థియేటర్స్ కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఆ లిస్ట్ లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రికార్డులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. పైగా చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ డోస్ పెంచుతోంది.

allu arjun ala vaikuntapurramuloo latest box office collections
Author
Hyderabad, First Published Jan 18, 2020, 5:32 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం సరికొత్త బాక్స్ ఆఫీస్ రికార్డులు నమోదవుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు - అల్లు అర్జున్ సినిమాలు ఒకేసారి దండయాత్ర చేయడంతో సినిమా థియేటర్స్ కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఆ లిస్ట్ లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రికార్డులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

allu arjun ala vaikuntapurramuloo latest box office collections

పైగా చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ డోస్ పెంచుతోంది.  ఇక ఫైనల్ గా అల వైకుంఠపురములో వరల్డ్ వైడ్ గా ఆరు రోజుల్లో 104కోట్ల షేర్స్ అందుకున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక వేగంగా బన్నీ 100కోట్ల షేర్స్ అందుకున్నాడు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 133కోట్లు. సినిమా ప్రాఫిట్ జోన్ లోకి రావాలంటే ఇంకా 30కోట్ల వరకు షేర్స్ రాబట్టాలి. ప్రస్తుతం సినిమా అయితే పాజిటివ్ టాక్ తోనే నడుస్తోంది.

allu arjun ala vaikuntapurramuloo latest box office collections

వీకెండ్ లో కలెక్షన్స్ డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ తో కొనసాగుతోంది అంటే సినిమా ఈ ఆదివారం ముగిసే సరికి బ్రేక్ ఈవెన్ అందుకోగలదనే టాక్ వస్తోంది.  మరీ బన్నీ ఈ రికార్డును ఎంతవరకు కొనసాగిస్తాడో చూడాలి, మరో వైపు యూఎస్ లో కూడా సినిమాపై డాలర్ల వర్షం కురుస్తోంది. అల.. వైకుంఠపురములో యూఎస్ లో ఈజీగా 1.5 మిలియన్ డాలర్స్ ను అందుకుంది.

allu arjun ala vaikuntapurramuloo latest box office collections

రీసెంట్ గా 2 మిళియన్స్ డాలర్స్ ని కూడా క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మహేష్ సరిలేరు నీకెవ్వరు $1.5మిలియన్స్ ని దాటినప్పటికీ. బన్నీ స్పీడ్ చూస్తుంటే మహేష్ ఆ రికార్డ్ ని బీట్ చేయడం సాధ్యం కాదనే తెలుస్తోంది. పైగా బన్నీ కంటే ముందే మహేష్ సినిమా రిలీజ్ అయ్యింది అంటే అల వైకుంఠపురములో బజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios