టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవల కాలంలో పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. GA2 పిక్చర్స్ ని స్థాపించి కొత్త తరహా కంటెంట్ తో మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు, కొత్త దర్శకులకు, అలాగే టాలీవుడ్ సక్సెస్ రేస్ లో వెనుకబడ్డ సీనియర్ దర్శకులకు అవకాశాలు అందిస్తూ మంచి లాభాలను అందుకుంటున్నారు.

ఇక రీసెంట్ గా ఈ మెగా ప్రొడ్యూసర్ మరొక కొత్త దర్శకుడి టాలెంట్ కి ఫిదా అయినట్లు తెలుస్తోంది. పలాసా 1978 సినిమా చూసిన అల్లు అరవింద్ చిత్ర యూనిట్ ని స్పెషల్ గా అభినందించారు. త్వరలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే డైరెక్టర్ కరుణ పని తీరును మెచ్చి అల్లు అరవింద్ బంపర్ అఫర్ ఇచ్చారట. గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయమని అఫర్ చేయడంతో దర్శకుడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అల్లు అరవింద్ సినిమాపై పాజిటివ్ గా స్పందించడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఇక డైరెక్టర్ కరుణ కుమార్ కి కూడా గీత ఆర్ట్స్ బ్యానర్ లో అఫర్ దక్కడంతో టాలీవుడ్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇక పలాస 1978 సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రక్షిత్, నక్షత్ర ప్రాధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సింగర్ రఘు కుంచె స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.