బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకున్న బ్యూటీ అలియా భట్. కెరీర్ మొదట్లోనే బికినీతో రచ్చ చేసిన ఈ బ్యూటీ నటిగా కూడా తనను తాను చాలా మార్చుకుంటోంది. ప్రస్తుతం RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా అమ్మడు మొదటిసారి తెలుగు తెరపై మెరవనుంది.  అందులో రామ్ చరణ్ కి జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల బేబీకి సంబందించిన కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి, అమ్మడు బ్రహ్మాస్త్ర సినిమా అనంతరం అమ్మడు రణ్ వీర్ ని పెళ్లి చేసుకోనోతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై స్పందించిన అలియా అందులో ఎలాంటి నిజం లేదని నవ్వుతూ ఒక క్లారిటీ ఇచ్చేసింది.

 

'ఇలాంటి రూమర్స్ మూడు వారాలకోసారి వినిపిస్తూనే ఉంటాయి. నాపై ఎలాంటి రూమర్స్ వస్తాయో నాకు అస్సలు అర్ధం కావడం లేదు. అయితే వాటిని నేను పెద్దగా పట్టించుకోను. విని నవ్వుకుంటాను. అవి కేవలం వినోదం కోసం మాత్రమే" అని అలియా వివరణ ఇచ్చింది. గతంలో కూడా అలియా పెళ్లిపై అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అమ్మడు ఎప్పటికప్పుడు వాటిని కొట్టిపారేస్తున్నా రూమర్స్ డోస్ తగ్గడం లేదు. ఏక రణ్ బీర్ అయితే వాటిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.