Asianet News TeluguAsianet News Telugu

'అల.. వైకుంఠపురములో' ఫస్ట్ వీక్ కలెక్షన్స్: నాన్ బాహుబలి రికార్డ్!

సంక్రాంతికి విడుదలైన అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ప్రదర్శన కనబరుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ లో అద్భుతమైన స్పందన అందుకుంది.

Ala Vaikunthapurramuloo First week collections
Author
Hyderabad, First Published Jan 19, 2020, 6:46 PM IST

సంక్రాంతికి విడుదలైన అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ప్రదర్శన కనబరుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ లో అద్భుతమైన స్పందన అందుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లో మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రానికి వసూళ్లు నమోదవుతున్నాయి. 

అల్లు అర్జున్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. సుశాంత్, నివేత పేతురాజ్ కీలక పాత్రల్లో నటించారు. టబు చాలా కాలం తర్వాత తెలుగులో నటించిన చిత్రం ఇది. తమన్ సంగీతం, త్రివిక్రమ్ రచన, అల్లు అర్జున్ ఫెర్ఫామెన్స్ ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. 

'సిత్తరాల సిరపడు' పాటకి టీడీపీ ఎంపీ ఎమోషనల్.. అల్లు అర్జున్ కి థాంక్స్!

తొలి రోజు నుంచి అల వైకుంఠపురములో చిత్రం బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ చిత్రం విడుదలైన వారం రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా తొలి వారం కలెక్షన్స్ వివరాలు పరిశీలిద్దాం. అల వైకుంఠపురములో చిత్రం బన్నీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల షేర్ అందుకుంది. 

తొలి వారం ముగిసే సమయానికి అల వైకుంఠపురములో చిత్రం 108 కోట్లకు పైగా షేర్ సాధించి నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. బాక్సాఫీస్ వద్ద బన్నీ రోజు ఎలా ఉందో అని. 

ఏరియాల వారీగా అల వైకుంఠపురములో చిత్ర వసూళ్లు ఇలా ఉన్నాయి.. 

ఏరియా                                               కలెక్షన్స్(షేర్)

నైజాం                                                  28.19 కోట్లు 

ఉత్తరాంధ్ర                                           13.45 కోట్లు 

సీడెడ్                                                   13.42 కోట్లు 

ఈస్ట్                                                      7.09 కోట్లు 

వెస్ట్                                                       6.21 కోట్లు 

గుంటూరు                                             8.18 కోట్లు 

కృష్ణా                                                     6.48 కోట్లు 

నెల్లూరు                                                 3.22 కోట్లు 

ఏపీ, తెలంగాణ మొత్తం                         86.24 కోట్లు 

ఇండియా ఇతర ప్రాంతాలు                   8.89 కోట్లు 

ఓవర్సీస్                                                12.95 కోట్లు 

వరల్డ్ వైడ్ మొత్తం                                 108.08 కోట్లు   

Follow Us:
Download App:
  • android
  • ios