Asianet News TeluguAsianet News Telugu

అతి తెలివితో : ‘అల వైకుంఠపురంలో..’ అపాలజీ చెప్పిన డిస్ట్రిబ్యూటర్స్!

అయితే ప్రచారం చేసిన దానికి విరుద్దంగా...నిన్నటి(గురువారం) నుండి SunNxt లో అల వైకుంఠపురంలో సినిమా స్ట్రీమింగ్ అయిపోతోంది. అంతేకాదు Netflix లో కూడా స్ట్రీమ్ అవుతోంది. 

Ala Vaikunthapurramloo overseas distributors Extend Apologies
Author
Hyderabad, First Published Feb 28, 2020, 9:57 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో మెగా హీరో అల్లు అర్జున్, పూజా హెగ్దే జంటగా నటించిన సినిమా  ‘అల వైకుంఠపురంలో..’ సంక్రాంతికి కు విడుదలైన ... ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అక్కడితో ఆగకుండా... నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచి రికార్డ్ లు క్రియేట్ చేసింది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్లకు పైగా వసూళ్లు రాగా.. అమెరికాలో మూడు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

అయితే ఈ సినిమా విడుదల సమయంలో వేసిన పబ్లిసిటీ పోస్టర్ లో జనవరి 11 నుంచి యూఎస్ ప్రీమియర్ మొదలు అని వేసి, దాని కిందే ఈ సినిమా మీకు Amazon prime , Netflix లో అందుబాటులో ఉండదు అంటూ ప్రచారం చేసారు. అది ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారి ఓవర్ సీస్ డిస్ట్రబ్యూటర్స్ అపాలజీ చెప్పే పరిస్దితి తెచ్చింది.

విశ్వక్ సేన్ 'హిట్' ట్విట్టర్ రివ్యూ

అయితే ప్రచారం చేసిన దానికి విరుద్దంగా...నిన్నటి(గురువారం) నుండి SunNxt లో అల వైకుంఠపురంలో సినిమా స్ట్రీమింగ్ అయిపోతోంది. అంతేకాదు Netflix లో కూడా స్ట్రీమ్ అవుతోంది. దాంతో ఈ సినిమాని Netflix లో చూసి ఆశ్చర్యపోతున్నవారంతా మమ్మల్ని థియేటర్లకు రప్పించడంకోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారా అంటూ సినిమా యూనిట్ పై ఓ రేంజిలో ఫైరవుతున్నారు.

అయితే తమకు ఆ విషయం తెలియదని, థర్డ్ పార్టీ అయిన సన్ నెక్ట్స్ వాళ్లకి, నెట్ ఫ్లిక్స్ కు టైఅప్ ఉండటంతో ఇలా జరిగిందని వివరణ ఇస్తోంది. సినిమా ప్రమోషన్ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటామని మరోసారి ఇలా జరగనీయమని బ్లూ స్కై సినిమాస్ ప్రకటనను విడుదల చేసింది. అయితే అంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ నడిపేవారికి ఈ విషయం తెలియదా అని నెట్ జనలు అంటున్నారు. కావాలని ప్రక్కదారి పట్టించారని పోస్ట్ లు పెడుతున్నారు. చాలా మంది దీన్ని చీప్ పబ్లిసిటీ ట్రిక్ గా అభివర్ణిస్తున్నారు.

ఇక ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలైన నెలరోజులకే “ఓటీటీ ప్లాట్ ఫ్లామ్ లలో ” ప్రత్యక్షమవుతోంది. ఇక విదేశాల్లో ఉండే భారతీయుల్లో ఎక్కువ మంది థియేటర్ లో కన్నా ఇంట్లో రాత్రి సమయాల్లో ఓటీటీ ప్లాట్ ఫ్లామ్ లలో కొత్త సినిమాలు చూసేస్తారు.. కాబట్టి ఎక్కువమంది పేక్షకులను థియేటర్ లకు రప్పించటానికే Amazon prime , Netflix స్ట్రీమ్ అవ్వదని ప్రచారం చేసారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios