ఐశ్వర్యారాయ్ లీక్డ్ వీడియో హల్ చల్.. చూపు తిప్పుకోలేరు!  

మాజీ ప్రపంచ సుందరి ఐశ్యర్యరాయ్ ఇండియాలో అందానికి మారుపేరుగా మారిపోయింది. 1994లో ఐశ్వర్య రాయ్ ప్రపంచ్చ సుందరి కిరీటం గెలుచుకున్న తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఐశ్వర్యారాయ్ తన అందం అభినయంతో ప్రేక్షకులని మంత్రముగ్దుల్ని చేసింది. 

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్ 1997లో రాధేశ్యామ్ సీతారామ్ అనే చిత్రంలో నటించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ఇప్పటికి రిలీజ్ కాలేదు. ఆ చిత్రంలో ఓ సాంగ్ లో ఐశ్యర్యారాయ్ పెర్ఫామ్ చేస్తున్న మేకింగ్ వీడియో ఇటీవల లీకై ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. 

ఈ వీడియోలో ఐశ్వర్యారాయ్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో అందాల దేవతలా వెలిగిపోతోంది. ఇక ఐశ్వర్యరాయ్ డాన్స్ మూవ్ మెంట్స్ మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. మొత్తంగా 23 ఏళ్ల నాటి వీడియో ప్రస్తుతం ప్రేక్షకులని చూపు తిప్పుకోనివ్వడం లేదు. 

సునీల్ శెట్టి, పరేష్ రావల్ ఈ చిత్రంలో నటించారు. ఐశ్వర్యరాయ్ రేర్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.