90వ దశకంలో శృంగార తారగా షకీలా ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో షకీలా నటించిన చిత్రాలు విడుదలవుతుంటే స్టార్ హీరోలు కూడా తమ చిత్రాలని వాయిదా వేసుకునే పరిస్థితి ఉండేది. అంతలా షకీలా సౌత్ లో ప్రభావం చూపింది. షకీలా మంచి మనసున్న వ్యక్తి అని ఆమె సన్నిహితులు అంటుంటారు. తేడా వస్తే మాత్రం ఎంతవారైనా.. ఎంతటి పోరాటానికైనా వెనుకాడదు. 

ఇటీవల షకీలా వెండితెరపై కనిపించడం తగ్గించింది. అప్పుడప్పుడూ కొన్ని చిత్రాలతో సందడి చేస్తోంది. ఇటీవల షకీలా నటించిన చిత్రం 'లేడీస్ నాట్ అలవ్డ్'. ఈ చిత్రానికి షకీలా నిర్మాత కూడా. గతంలో ఈ చిత్రం సెన్సార్ బోర్డు ముందుకు రాగా తిరస్కరణకు గురైంది. తాజాగా మరోసారి సెన్సార్ ఈ చిత్రాన్ని తిరస్కరించింది. 

పవన్ క్రేజ్ ని వాడుకునే పనిలో త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కోసం..

దీనితో షకీలా మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చిత్రాలు గతంలో అనేకం వచ్చాయి. వాటన్నింటికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ ఈ చిత్రానికే ఎందుకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. తాను ఎంతో కష్టపడి ఫైనాన్స్ ద్వారా డబ్బు తెచ్చి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు షకీలా పేర్కొంది. 

నిత్యానందపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్!

సెన్సార్ పూర్తి చేయడానికి డబ్బులు అడుగుతున్నట్లు మా దర్శకుడు సాయి తెలిపారు. మాది చిన్న చిత్రం కాబట్టే డబ్బులు అడుగుతున్నారు. పెద్ద సినిమాలకు వీళ్ళు డబ్బు తీసుకోరు. లేడీస్ నాట్ అలవ్డ్ చిత్రం అడల్ట్ కామెడీ జోనర్ లో తెరకెక్కింది. ఆ విషయాన్ని మేమే చెప్పాం. కానీ కొందరు వ్యక్తులు ఈ చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి జాగ్రత్త అంటూ షకీలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.