నేడు మెగాస్టార్ చిరంజీవితో మా అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ, కార్యనిర్వహణ కమిటీ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక ఊహాగానాలు వినిపించాయి. మా అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న నరేష్ ని తొలగించబోతున్నట్లు ప్రచారం జరిగింది. 

చిరంజీవి, కృష్ణంరాజు, జయసుధ, మురళి మోహన్ లాంటి ప్రముఖులతో మా సభ్యులు ఫిలిం ఛాంబర్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం కమిటీ సభ్యులు మా కొత్త అధ్యక్షుడిగా నటుడు 'బెనర్జీ'ని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అయితే బెనర్జీని తాత్కాలిక అధ్యక్షుడిగా మాత్రమే ఎన్నుకున్నట్లు తెలిపారు. 

నరేష్ ప్రస్తుతం 41 రోజులు సెలవులో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనితో నరేష్ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నరేష్, రాజశేఖర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. 

వీపులు గోకేది వాళ్లే.. చిరంజీవి ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం.. నటి షాకింగ్ కామెంట్స్!

మా నిధులు దుర్వినియోగానికి గురికాబడుతున్నాయి అంటూ రాజశేఖర్ ఆరోపణలు చేశారు. అలాగే నరేష్ ని సంప్రదించకుండా రాజశేఖర్ సొంతంగా ఎమర్జన్సీ మీటింగ్స్ నిర్వహించారు. ఈ పరిణామాలన్నీ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీనితో తాజాగా బెనర్జీని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించడం కొత్త చర్చకు దారితీస్తోంది. 

ఈ సమావేశంలో చిరంజీవి, కృష్ణం రాజు, మురళి మోహన్, జయసుధ, జీవిత రాజశేఖర్, రాజీవ్ కనకాల, అలీ పాల్గొన్నారు.