ఇండియన్ క్రికెటర్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే పేరు కపిల్ దేవ్. ఇండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ గా కపిల్ దేవ్ స్థానం ఎప్పటికి పదిలం. కపిల్ దేవ్ సాధించిన ఘనతల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అతడి జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలని ప్రేక్షకులకు అందించేందుకు దర్శకుడు కబీర్ ఖాన్ నడుం బిగించారు. 

ఆయన దర్శకత్వంలో బాలీవుడ్ క్రేజీ హీరో రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్న చిత్రం '83'. కపిల్ దేవ్ జీవిత చరిత్ర, 1983 ప్రపంచ కప్ విజయం ప్రధాన అంశాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులని అలరించింది.

మాస్టర్ కోసం ఎన్టీఆర్ సింగింగ్.. విజయ్ స్పెషల్ రిక్వెస్ట్!

రణవీర్ సింగ్ పూర్తిగా కపిల్ దేవ్ గెటప్ లోకి మారిపోయాడు. ఇందులో కపిల్ దేవ్ భార్య రోమి భాటియాగా దీపికా పదుకోన్ నటిస్తోంది.  తాజాగా రోమి పాత్ర‌లో దీపికాకి సంబంధించిన లుక్ విడుద‌ల చేసింది చిత్రబృందం. ర‌ణ్‌వీర్‌తో క‌లిసి ఉన్న దీపికా లుక్ ఆక‌ట్టుకుంటుంది. రోమి పాత్రకి దీపికా అతికినట్టు సరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రణవీర్, దీపికా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్న ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్ప‌టికే దీపికా, ర‌ణ్‌వీర్‌లు రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్ చిత్రాల‌లో క‌లిసి న‌టించారు. రియ‌ల్ లైఫ్‌లో భార్య భ‌ర్త‌లు అయిన వీరిద్ద‌రు పెళ్లి త‌ర్వాత క‌లిసి న‌టించిన తొలి చిత్రం 83 కావ‌డం విశేషం.