ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంల తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌. ఈ సినిమాతో చాలా కాలంగా సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న రామ్‌, పూరిలకు సక్సెస్‌లు దక్కాయి. అంతేకాదు ఇక పూరి పని అయిపోయినట్టే అని భావించిన వారందరికీ సూపర్‌ హిట్‌ తో సమాదానం చెప్పాడు ఈ డాషింగ్ డైరెక్టర్‌. ఇస్మార్ట్ శంకర్ సినిమానే కాదు ఆడియో కూడా సూపర్‌ హిట్ అయ్యింది. సీనియర్‌ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలందించిన ఈ సినిమాలోని పాటలు ఆన్‌లైన్‌లో అరాచకం చేస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాలోని దిమాక్ కరాబ్ పాటకు యూట్యూబ్‌లో 100 మిలియన్‌ల వ్యూస్‌ వచ్చాయి. అంటే 10 కోట్ల కు పైగా వ్యూస్‌ దక్కాయన్న మాట. రామ్ సరసన నిది అగర్వాల్, నభా నటేష్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ పాట ఇప్పటికీ రచ్చ కొనసాగిస్తోంది. దీంతో ముందు ముందుకు మరిన్ని రికార్డుల ఖాయమని భావిస్తున్నా ఫ్యాన్స్‌.

ఇక ఈ సినిమా తరువాత రామ్ తమిళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న రెడ్‌లో నటిస్తున్నాడు ఈ సినిమా మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో హిట్ ట్రాక్‌లోకి వచ్చిన పూరి ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా లెవల్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సార్‌గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.