కడప: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అల్టిమేటం జారీ చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలను ఒప్పుకోకుంటే ఆయన ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. 

వైయస్ జగన్ సీఎం అయితే తిరుమలకు పాదయాత్ర చేస్తానని మెుక్కుకున్నానని దాన్ని ఇప్పుడు చెల్లిస్తున్నట్లు తెలిపారు. మెుక్కులో భాగంగా ఈనెల 4న ప్రకాశం జిల్లా కాకర్ల నుంచి అన్నారాంబాబు పాదయాత్ర చేపట్టారు. 

ఆ పాదయాత్ర ఎనిమిదిరోజులకు చేరుకుంది. ఎనిమిదోరోజు వైయస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చేరుకుంది. ఈ సందర్భంగా అన్నా రాంబాబుకు బద్వేల్ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్యతోపాటుు వైసీపీ నాయకులు, ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తన స్వాగతం పలికారు.  

అనంతరం మీడియాతో మాట్లాడిన అన్నా రాంబాబు ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లలో చేసిన తప్పిదాలను వచ్చే శాసన సభ సమావేశాల కల్లా ఒప్పుకోకపోతే ఇంటి ముందే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

రాజీనామా చేస్తా: అసెంబ్లీలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలనం