సమాజంలో పరిస్థితులు రోజు రోజుకీ దారుణంగా తయారౌతున్నాయి. పసి పిల్లల దగ్గర నుంచి చావు దగ్గరైన ముసలమ్మను కూడా కొందరు కామాంధులు వదలడం లేదు. తల్లీ, చెల్లీ అనే తేడా లేకుండా తమ కామ వాంఛ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే కనీసం మూగ జీవులను కూడా వదలడం లేదు. అభం, శుభం తెలియని ఓ లేగ దూడపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం నిజాంపూర్‌లో గురువారం రాత్రి పశువుల కొట్టంలో ఉన్న లేగ దూడపై  జేడీ లక్ష్మణ్ అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా.. లక్ష్మణ్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న పశువుల కొట్టంలో కట్టివేసి ఉన్న లేగదూడ పట్ల జైడి లక్ష్మణ్‌ అనాగరికంగా ప్రవర్తించడాన్ని గమనించిన స్థానికులు యజమాని దృష్టికి తీసుకెళ్లారు. 

లేగదూడ యజమాని తెనుగు పోశెట్టి ఫిర్యాదు చేయగా.. లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. లేగదూడకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.