Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ పేరిట వంచన... రేప్ చేసి.. తన స్నేహితులతో కూడా...

ఆ సమయంలో ఆమెకు ఆటో డ్రైవర్ నరేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. నరేష్ కి గతంలోనే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని దాచి ఆమెను ప్రేమ పేరిట మోసం చేశాడు. శుక్రవారం గుడికి వెళదామని చెప్పి... ఓ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ  ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

woman raped by her lover and his friends in nizamabad
Author
Hyderabad, First Published Sep 21, 2019, 10:11 AM IST

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని దాచి... అమాయకురాలైన ఓ యువతిని వలలో వేసుకున్నాడు. ప్రేమ పేరిట ఆమెకు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటాని నమ్మించాడు. ఆమె పూర్తిగా అతని మాయలో పడిన తర్వాత... ఎవరూ లేని ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా.. తన స్నేహితులు మరో ఆరుగురిని పిలిపించి... వారు కూడా అత్యాచారం చేసేలా ప్రోత్సహించాడు. ఈ విషయాన్ని యువతి బయటపెట్టకుండా ఉండేందుకు జరిగిందంతా వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి ఆమెను బెదిరించాడు. కాగా... చివరకు బాధిత యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... నిజామాబాద్ నగర శివారులోని ఓ పల్లెటూరుకి చెందిన యువతి ది నిరుపేద కుటుంబం. కుటుంబం మొత్తం కష్టపడితేగానీ.. నోట్లోకి ఐదువేళ్లు వెళ్లని పరిస్థితి. దీంతో,... ఆమె కూడా పనిచేయాల్సిన పరిస్థితి. కాగా..  సంవత్సరం నుంచి తమ ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. బస్సు సౌకర్యం లేకపోవడంతో రోజూ ఆటోలో వెళ్లి వచ్చేది.

ఆ సమయంలో ఆమెకు ఆటో డ్రైవర్ నరేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. నరేష్ కి గతంలోనే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని దాచి ఆమెను ప్రేమ పేరిట మోసం చేశాడు. శుక్రవారం గుడికి వెళదామని చెప్పి... ఓ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ  ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని తర్వాత అతని ఆరుగురు స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనినంతటినీ వీడియో తీసి... ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించడం గమనార్హం.

అనంతరం ఆ వీడియోని... వారిలో ఇద్దరు యువకులు తమ ఫోన్ లో చూసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతుండగా... అటుగా వెళ్తున్న పోలీసులు వారిని గమనించారు. వీడియోని పరిశీలించి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించి పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని కలిసి ఆమె ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుల్లో ఇద్దరు మాత్రమే పోలీసులకు చిక్కగా... మిగిలిన వారు పరారీలో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios