ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మృగాళ్లు రెచ్చిపోయారు. ఓ ఒంటరి మహిళపై కీచకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ స్త్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఆ దారుణమైన సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారంనాడు వెలుగు చూసింది. గొంతులో బియ్యం పోసి, గొంతులో దుస్తులు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారు.  35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళ జాతీయ రహదారిపై స్పృహ కోల్పోయి, అర్థనగ్నంగా పడి ఉంది. 

Also Read: రైల్లో హెచ్ఐవి బాధిత మహిళపై ఒకరు రేప్, వీడియో తీసిన మిత్రుడు

మహిళను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని పోలీసులు రిమ్స్ కు తరలించారు. అప్పటికీ ఆమె ఆపస్మారక స్థితిలోనే ఉంది. వైద్యులు ఆమెను పరీక్షించారు. గొంతులోకి, ఊపిరితిత్తుల్లోకి బియ్యం వెళ్లినట్లు గుర్తించి చికిత్స ప్రారంభించారు.

గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వైద్యం పొందుతున్న ఆమె బుధవారం మధ్యాహ్నం మరణించింది. 

Also Read: నన్ను రేప్ చేశారు.. కమెడియన్ రాహుల్ రామకృష్ణ షాకింగ్ కామెంట్స్! 

మృతురాలిని ఒంగోలులోని స్థానిక శ్రీనగర్ కాలనీవాసిగా గుర్తించారు. పేర్నమిట్టకు చందిన ఆమె భర్తతో విడిపోయి ఒంటరిగా నివసిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.