కర్నూల్ జిల్లా డోన్ స్థానిక మండల పరిధిలోని కమలాపురం గ్రామానికి కూలి పని నిమిత్తం వెళ్లి వస్తున్న ఆటో మార్గ మధ్యలో అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరికాసేపట్లో తమ గమ్యస్థానాలకు చేరుకుంటామని ఆనందంగా వెళుతున్న వ్యవసాయ కూలీలను కాలం కాటేసింది... పరిమితికి మించి కూలీలను ఆటోలు తీసుకెళ్లడంతో అదుపుతప్పి బోల్తా పడింది.

ఆ సమయంలో ఆటోలో 15 మంది ప్రయాణం చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.మృతి చెందిన కూలీనీ లలిత అనే మహిళ గా గుర్తించారు. లలిత అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి  చికిత్స నిమిత్తం తరలించారు.  మృతి చెందిన మహిళను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 ఆటోలో ప్రయాణిస్తున్న మొత్తం 15 మంది ప్రయాణికులు కనపకుంట గ్రామస్తులు గా తెలుస్తుంది.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.