కర్నూలు  జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాపురానికి పిలుచుకు వెళ్లడానికి వచ్చిన భర్తపై తన కుటుంబసభ్యులతో దాడి  చేయించడమే కాకుండా... అతని పురుషాంగాన్ని కూడా కోసేసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా గడివేముల మండలం సోమాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి  కొంతకాలం క్రితం  వివాహమైంది. కాగా... అతని భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లింది. తిరిగి మళ్లీ అత్తారింటికి రాలేదు. దీంతో... భార్య పుట్టింటికి వెళ్లి... తన ఇంటికి రావాలని కోరాడు. భర్తతో పాటు అత్తారింటికి రాకపోగా... ఆమె దాడి చేయడం గమనార్హం.

భర్తను తాడుతో కట్టేసి దారుణంగా కొట్టింది. ఆమె కుటుంబసభ్యులు కూడా  సహకరించడం విశేషం. అందరూ కలిసి ఆ యువకుడి పురుషాంగాన్ని కూడా కోసేశారు. తీవ్రగాయాలపాలై ఇబ్బంది పడుతున్న అతనిని స్థానికులు స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

అక్కడ ప్రాధమిక చికిత్స అనంతరం నంద్యాలకు తరలించారు.అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా.. భార్య, ఆమె కుటుంబసభ్యులు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.