తనను ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో ఓ మహిళ కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే... శ్రీకాళం జిల్లా టెక్కలి మండలం పాత నౌపాడ ప్రాంతానికి చెందిన వెంకటరమణకు కొన్ని సంవత్సరాల క్రితం  జగదీశ్వరి అనే మహిళతో వివాహం జరిగింది.

వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వివాహం తర్వాత వెంకటరమణకు మద్యానికి బానిసగా మారాడు. ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి భార్యను నారా రకాలుగా హింసించేవాడు. రోజూ తీవ్రంగా కొట్టేవాడు. కాగా... బిడ్డ కోసం ఆమె రోజూ ఆ నరకాన్ని భరిస్తూ వచ్చింది.

తాజాగా.. శుక్రవారం రాత్రి వెంకటరమణ రోజూలాగే మద్యం తాగి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే భార్యతో గొడవకు దిగాడు. భార్య జగదీశ్వరిని , కొడుకును చంపేస్తానని అన్నాడు. అక్కడితో ఆగకుండా కిరోసిన్ సీసా తీసుకువచ్చి భార్య, కొడుకుపై పోసి నిప్పు అంటించాలని ప్రయత్నించాడు. దీంతో... తన ప్రాణంతోపాటు, కొడుకు ప్రాణాలు ఎక్కడ పోతాయోనని భయపడింది.

వెంటనే భర్తను ప్రతిఘటించింది. ఈ క్రమంలో తన, కొడుకు ప్రాణాలు కాపాడుకునేందుకు భర్త తలపై కర్రతో కొట్టింది. దీంతో తీవ్రగాయమై... వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మరక్షణలో భాంగానే తన భర్తను హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా... వెంకటరణ రైల్వే ట్రాక్ మెన్ గా పనిచేసేవాడని పోలీసులు చెబుతున్నారు.