Asianet News TeluguAsianet News Telugu

13 స్కూళ్లు,2500 విద్యార్థులు...లయన్స్ క్లబ్ చిల్డ్రర్స్ డే సెలబ్రేషన్స్

మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ పుట్టినరోజును పురస్కరించుకుని విశాఖపట్నం లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో భారీస్థాయిలో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ జరగనున్నాయి. దాదాపు వారంరోజులపాటు ఈ వేడుకలు జరపనున్నట్లు లయన్స్ క్లబ్ ప్రకటించింది.   

vishakapatnam lions club arrangements on childrens day special celebrations
Author
Visakhapatnam, First Published Oct 28, 2019, 4:00 PM IST

విశాఖపట్నం: విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసానికి  పెంపొందించేందుకు నవంబర్  1 నుంచి 14వ తేదీ వరకు  బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వేడుకల కమిటీ చైర్మన్ పి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. రామ్ నగర్ లోని లయన్స్ క్లబ్ కమ్యూనిటీ సెంటర్ లో ఈ వేడుకలను జరపనున్నట్లు వెల్లడించారు.

సోమవారం లైన్స్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలలో సుమారు 130 పాఠశాలల నుంచి 2500 పైగా విద్యార్థులు వివిధ అంశాలలో పోటీ పడతారన్నారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి విఎంఆర్‌డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. 

read more 150 సీట్లిచ్చిన ప్రజలకు వైసిపి రిటర్న్ గిప్ట్ ఇదే...: కన్నాలక్ష్మీనారాయణ

ఈ పోటీలను జూనియర్, సీనియర్ విభాగాలుగా నిర్వహిస్తామన్నారు. ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు అందరూ ఈ పోటీలలో పాల్గొనవచ్చని తెలిపారు. చిత్రలేఖనం, చదరంగం, క్యారమ్స్, వ్యాసరచన, జానపద, సంప్రదాయ నృత్యాలు, విచిత్ర వేషధారణ, అభినయం, భక్తిగీతాలు, తెలుగు పద్య పఠనం, విజ్ఞాన ప్రదర్శన, వకృత్వ తదితర పోటీలు నిర్వహిస్తామన్నారు. 

ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నవంబర్ 14న దేశ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం పురస్కరించుకొని నగరానికి చెందిన ప్రముఖుల చేతులమీదుగా బహుమతులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 0891-2550500 లేదా 9866302039 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. 

read more వైసిపి దళారుల వల్లే ఇసుక కొరత...ఇక తాడోపేడో: ఏపీ బిల్డింగ్ వర్కర్స్ ఫెడరేషన్

ఈ సమావేశంలో  లయన్స్ క్లబ్ ప్రతినిధులు దుర్గాప్రసాద్, ఉదయ శంకర్, సూర్యపకాష్, రామచంద్ర రావు, సుధాకరరావు, మూర్తి, దుర్గ ఆనంద్,  అచ్యుతరెడ్డి,  మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios