ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపట్ల టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తెలంగాణ గర్వించదగ్గ హాస్యనటుడని , మంచి నటుడిగా గుర్తింపు పొందారని ఉత్తమ్ తెలిపారు. వేణు మాధవ్ మరణం సినీ రంగానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సైతం వేణుమాధవ్ మృతికి సంతాపం తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ మంచి హాస్యనటుడిని కోల్పోయిందని ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

ఎన్నికల ప్రచారంలో ఆకట్టుకునేవారు: చంద్రబాబు

వేణుమాధవ్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళాకారుడిగా, సినీ హాస్యనటుడిగా ప్రజల హృదయాల్లో ఆయన చెరగని ముద్రవేశారన్నారు.

టీడీపీ ఎన్నికల ప్రచారంలో తనదైన ప్రత్యేకతతో ప్రజలను ఆకట్టుకున్నారని.. వేణుమాధవ్ మృతికి నివాళులర్పిస్తూ ఆయన అభిమానులకు, కుటుంబసభ్యులకు చంద్రబాబు సానుభూతిని ప్రకటించారు. 
 

 

లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు: కేసీఆర్

వేణుమాధవ్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

టీడీపీ శ్రేయోభిలాషి: నారా లోకేశ్

వేణు మాధవ్ తెలుగుదేశం పార్టీకి శ్రేయోభిలాషన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి వరకు పార్టీకి వేణుమాధవ్ చేసిన సేవలు వెలకట్టలేనివని, ఆయన మరణం విచారకరమన్నారు. వేణుమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. 

వేణుమాధవ్ మృతిపై టీటీడీపీ సంతాపం

వేణుమాధవ్ మృతిపట్ల టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, పొలిటీ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బక్కని నర్సింహులు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు అరవింద్ కుమార్ గౌడ్, కొత్తకోట దయాకర్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

చిన్న వయస్సులోనే వేణఉమాధవ్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. తొలి నుంచి టీడీపీతో వేణుమాధవ్‌కు అనుబంధం ఉందని ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే.

వాళ్ల కోసం గుండు కొట్టించుకున్నా.. చిరు, బాలయ్యలపై వేణుమాధవ్ వ్యాఖ్యలు!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

టైమింగ్ ఉన్న నటుడు వేణుమాధవ్... పవన్ కళ్యాణ్ సంతాపం