Asianet News TeluguAsianet News Telugu

వేంపెంటలో చిరుత కలకలం: గస్తీ తిరుగుతున్న గ్రామస్తులు

చిరుత పులిని చూసిన వేంపెంట గ్రామస్తులు భయాందోళనలకు గురౌతున్నారు.చ చిరుతపులిని పట్టుకోవాలని  గ్రామస్తులు కోరుతున్నారు.

vempenta Villagers panic after claims of tiger sighting
Author
Kurnool, First Published Feb 16, 2020, 5:51 PM IST


 కర్నూల్ :కర్నూల్ జిల్లా  వేంపెంట లోకి చిరుత పులి  గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. పాములపాడు మండలంలోని వేంపెంట గ్రామంలోకి నెలలోనే రెండవసారి చిరుత పులి  కన్పించడం గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తోంది. 

శనివారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో గ్రామంలో  చిరుతపులి తిరగడంతో  గ్రామస్తులు భయంతో ఇండ్ల నుండి బయలకు రాలేదు.  వెంటనే అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు.  

చిరుత నుండి గ్రామస్తులను కాపాడేందుకు యువకులు గ్రూపుగా ఏర్పడి  గస్తీ నిర్వహిస్తున్నారు. త్వరగా చిరుతపులిని పట్టుకొని  తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios