ఆదిలాబాద్: ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో రిటైర్డ్ ఎఎస్ఐ హత్య జరిగింది. ఈ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. తాళ్లపల్లి శివరాజ్ అనే రిటైర్డ్ ఎఎస్ఐని తమ్ముడి కుమారుడు కర్రలతో కొట్టి హత్య చేశాడు. ఈ నెల 6వ తేదీన ఈ హత్య జరిగింది. 

శివరాజ్ ను హత్య చేసిన తర్వాత నిందితుల్లో ఒక్కడైన వివేక్ సెల్ఫీ తీసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గంగన్నపేటలో శివరాజ్ హత్య జరిగింది. 

గత కొన్నేళ్లుగా శివరాజ్ కుటుంబానికి, తమ్ముడు జైరాజ్ కుటుంబానికి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారంనాడు జైరాజ్ కుమారుడు వివేక్ తో ఘర్షణ పడుతూ శివరాజ్ గంగన్నపేట రోడ్డు వైపు వచ్చాడు. 

వివేక్ తన చేతిలో ఉన్న కర్రతో శివరాజ్ తలపై బలంగా కొట్టాడు. దాంతో శివరాజ్ మరణించాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. మృతుడి భార్య రోజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వివేక్ సెల్ఫీ తీసుకున్నట్లు తేలింది. 

మృతుడు శివరాజ్ కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. శివరాజ్ 2017లో కెరమెరీ పోలీసు స్టేషన్ లో పనిచేస్తూ రిటైర్ అయ్యాడు.