హుజూర్‌నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపుఖాయమన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి పక్షాన ఆయన సోమవారం హుజూర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు కేసీఆర్ పాలనతో విసుగెత్తిపోయారన్నారు. ఆర్టీసీ సమ్మెను పరిష్కరించలేని అసమర్థ పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు.

ప్రభుత్వంలోని మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని త్వరలో ప్రభుత్వంనిజస్వరూపం బయటపడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఇదే నియోజకవర్గం నుండే తాము మళ్ల్లీ గెలిచి కేసీఆర్ కళ్లు తెరిపిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.