సూర్యాపేట జిల్లాలోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో శుక్రవారం ఉదయం పేలుడు కలకలం రేగిన సంగతి తెలిసిందే. కాగా...  అది బాంబు పేలుడు కాదని జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. బాంబు పేలుడు జరగలేదని.. పాత సామాను గోదాములో ప్లాస్టిక్ టిన్‌లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి మిషన్ పై ప్రాసెస్ చేస్తుండగా రసాయనాలు వేడిమికి గురై పేలుడు జరిగిందని స్పష్టం చేశారు.
 
ఎక్కువ లోడ్ వల్ల ఇది జరిగిందే తప్ప.. ఇక్కడ ఎలాంటి బాంబు పేలుడు జరగలేదన్నారు. ప్రజలు ఇలాంటి రూమర్స్‌ను నమ్మొద్దని ఎస్పీ మీడియాకు వివరించారు. 

కాగా... శుక్రవారం ఉదయం  పాత ఇనుప సామాన్ల దుకాణంలో సంభవించిన బాంబు దాటికి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాంచందర్ గా గుర్తించారు. 

related news

సూర్యాపేటలో పేలుడు: ఒకరు మృతి, మరోకరికి గాయాలు