కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో విషాదం నెలకొంది. మూడురోజుల క్రితం అదృశ్యమైన పదవ తరగతి విద్యార్థిని నిహారిక అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. పట్టణంలోని మున్సిపల్ వాటర్ ఫిల్టర్ బెడ్ దగ్గర గురువారం మధ్యాహ్నం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.  

వివరాల్లోకి వెళితే...ఎమ్మిగనూరు సోమప్ప నగర్ లో నివాసముండే నిహారిక రవీంద్ర భారతి స్కూల్ లో పదవ తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా అదే కాలనీలో ఉండే ఒక యువకుడితో చనువుగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆ తర్వాతిరోజే అంటే 17 వ  తేదీన ఉదయం 6 గంటలకు ఎప్పట్లాగే ట్యూషన్ కి వెళ్తానటూ వెళ్లిన నిహారిక ఇంటికి తిరిగిరాలేదు. 

రాత్రయినా తమ కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు ప్రారంభించిన పోలీసులు
 పట్టణానికి సమీపంలో ఎల్‌ఎల్‌సి కెనాల్ గట్టుపై నిహారిక సైకిల్ మరియ బ్యాగ్ ను గుర్తించారు. దీంతో ఆమె కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకుని వుంటుందన్న అనుమానంతో గజ ఈతగాళ్ల సాయంతో కెనాల్ లో వెతకడం ప్రారంభించారు.

read more  జగన్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండగ... త్వరలోనే 'రంగు'పడుద్ది: వర్ల రామయ్య

రెండు రోజులుగా వెతికినా నిహారిక ఆచూకీ లభించక పోయేసరికి ఎమ్మిగనూరు సమీపంలో ఉండే గుడికల్ చెరువు లో గత రెండు రోజులుగా గాలిస్తున్నారు. అయితే. ఈ రోజు మధ్యాహ్నం ఈ చెరువు లో స్కూల్ డ్రెస్ లో ఉన్న నిహారిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 

అయితే నిహారిక మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. తల్లిదండ్రులు మందలించడం వల్లే నిహారిక ఆత్మహత్య చేసుకుని వుంటుందని పోలీసులు  అనుమానిస్తున్నారు. పోస్టు మార్టం రిపోర్టును బట్టి మరింత క్లారిటీ రానుందని పోలీసులు తెలిపారు. 

read more  రాజధానిపై జగన్ ప్రకటన... ప్రజాభిప్రాయం ఎలా వుందంటే: అవంతి శ్రీనివాస్