ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు న్యూడిల్లీకి చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ పిలుపుమేరకు సీఎస్ లు ఇప్పటికే డిల్లీకి చేరుకుని విభజన అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో హోంశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. 

కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏపీ , తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లు...సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల మద్య పరిష్కరించుకోవాల్సిన అంశాలపై అధికారులు చర్చించుకున్నారు.  

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ వద్ద విభజన అంశాలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రస్తావించారు. అపరిష్కృతంగా ఉన్న 9, 10 షెడ్యూలు, 13 షెడ్యూలు సంస్థల విభజన, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలకు సంబంధించిన అంశాలపై తాజాగా చర్చించినట్లు సమాచారం.