ఆర్టిసి  ఉద్యోగుల సమ్మె ఉద్రిక్తంగా మారుతోంది. తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడపడాన్ని కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసి ఉద్యోగులు అడ్డుకుంటున్నారు. బస్సులను అడ్డుకోవడమే కాదు ఉద్యోగాల కోసం డిపోల వద్దకు వస్తున్న యువతను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తాత్కాలిక ఉద్యోగులు, శాశ్వత ఉద్యోగులకు మధ్య వాగ్వివాదం జరిగి ఉద్రిక్తతకు దారితీస్తోంది. 

తాత్కాలిక ఉద్యోగుల  మూలంగా ఎలాంటి రోడ్డుప్రమాదాలు సంభవించకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా  రామగుండం ట్రాఫిక్ పోలీసులు బస్సులను ఆపి డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ మిషన్ తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు పర్యవేక్షణలో ప్రతి బస్ డ్రైవర్ కు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ఆర్టిసి ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తిరస్కరించడంతో సమ్మె అనివార్యమయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణా వ్యవస్థ స్తంభించింది.  శుక్రవారం అర్థరాత్రి నుండే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కూడా బస్సులన్ని నిలిచిపోవడంతో పండగ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

వీడియో

"