Asianet News TeluguAsianet News Telugu

గిరిజనాభివృద్దికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలివే: సత్యవతి రాథోడ్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతి-2 కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.

telangana minister satyavati rathod comments on pallepragathi-2
Author
Khammam, First Published Jan 6, 2020, 4:47 PM IST

భద్రాచలం: తెలంగాణ సీఎం కేసిఆర్ ఎంతో దూరదృష్టితో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారని... దీన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా పల్లెలన్ని వెలిగిపోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామాన్ని ఎలాంటి లోటులేకుండా తీర్చిదిద్దడానికి దక్కిన సదావకాశంగా దీన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని అన్నారు. 

సోమవారం దుమ్ముగూడెం మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి-2 కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ...   ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 

telangana minister satyavati rathod comments on pallepragathi-2

ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ఇప్పటికే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఇకపైకూడా మరిన్ని కార్యక్రమాలు తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.గత 30 రోజుల ప్రణాళికలో కొత్తగూడెంలో పాల్గొన్నామని, అప్పటి పల్లె ప్రగతిలో చాలా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈసారి రెండో దశలో గ్రామంలో ఇంకా మిగిలిన పనులన్ని పూర్తి చేసి సర్వ సమగ్ర పల్లెలుగా తీర్చదిద్దుకోవాలని సూచించారు. 

read more మున్సిపల్ ఎన్నికలు 2020: కేసీఆర్ కు బిజెపి భయం, కారణం ఇదీ...

గిరిజన అభివృద్దిలో భాగంగా ఇటీవలే రూ.250 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాలన్నింటికి 3 ఫేజ్ కరెంటు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా గిరివికాసం పథకం కింద గిరిజన భూములకు బోర్లు వేసి, మోటార్లు ఇచ్చి వాటిని వ్వవసాయ యోగ్యం చేస్తున్నారని తెలిపారు. 

telangana minister satyavati rathod comments on pallepragathi-2

మహిళల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సిఎం కేసిఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే అంగన్ వాడీలకు ఎక్కడా పెంచని విధంగా వేతనాలు పెంచారన్నారు. గర్భిణీ స్త్రీలకు అంగన్ వాడీ కేంద్రాలలో మధ్యాహ్నం ఉచిత భోజనం అందిస్తున్నారని చెప్పారు. అయితే అంగన్ వాడీ టీచర్లు  కొంతమంది మాటలు విని ధర్నాలు చేయడం సరైంది కాదన్నారు. 

read  more  తిరుమలలో మంత్రి హరీష్ రావుకి ఘోర పరాభవం

అనంతరం దుమ్ముగూడెం మండలంలోనే  గంగోలు గ్రామంలో ప్రభుత్వం రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లను మంత్రి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పోడెం వీరయ్య, కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక ఎంపీటీసీ, జడ్పీటీసీ  సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios