వనపర్తి: బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడయ్యాడు. కామం కళ్లు మూసుకుపోయి ఓ విద్యార్థినులను చెర పట్టాడు. హోం ట్యూషన్ కు పిలిచి 11 ఏళ్ల వయస్సు గల బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. టీచర్ ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. 

వనపర్తిలో ఆ సంఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో ఆ ఉపాధ్యాయుడి వల్ల బాలికలు తీవ్రమైన హింసకు గురయ్యారు. బాలికలందరూ నాలుగో తరగతి చదువుతున్నవారే. కొందరు బాలికలను పలుమార్లు అతను రేప్ చేశాడు. 

వివిధ సెక్షన్ల కింద ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పదేళ్ల వయస్సు గల ఇద్దరు బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. 

రక్తస్రావం జరుగుతోందని ఇద్దరు బాలికల్లో ఓ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో ఏం జరిగిందని బాలికను తల్లిదండ్రులు అడిగారు. టీచర్ చేతిలో తనకు జరిగిన చిత్రహింసల గురించి చెప్పింది. ఆ క్రమంలోనే అతను మరో బాలికపై కూడా అత్యాచారం చేసినట్లు బయటపడింది.