విజయవాడ: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా  తయారయ్యిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్లే పాలన ఇలా అస్తవ్యస్తంగా సాగుతోందని అన్నారు. 

తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో వివిధ వస్తువుల కొరత ఏర్పడటం చూశానని...కానీ ఇసుక కొరతను మాత్రం ఇప్పుడే చూస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి  జగన్ తో పాటే మంత్రులూ మూర్ఖులేనంటూ విమర్శించారు. వరదల వల్లే ఇసుక కొరత ఏర్పడిందన్న మంత్రులు... ఈ వర్షాలు కురవక ముందు ఏం చేశారని ప్రశ్నించారు. 

కార్మికుల ఆత్మహత్యలను వైసీపీ నేతలు ఎగతాళిగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో లారీ ఇసుక రూ. 10 వేలకు దొరికితే ఇప్పుడు అదే రూ. 50 వేలకు చేరిందన్నారు. ఇలా వైసీపీ పాలనలో తులం బంగారం ధరతో లారీ ఇసుక ధర సమానంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

read more  టిడిపిలో సన్నాసి నాయకులు...: కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

ఓవైపు ఉపాధి కోల్పోయి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే  సిగ్గులేకుండా వారోత్సవాలు నిర్వహిస్తారా..? అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి వెంటనే ఇసుక కొరతను నివారించే చర్యలు చేపట్టాలని సూచించారు. 

మరో టీడిపి సీనియర్ నాయకులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ...సుక కొరత జీవితంలోనే మొదటిసారి చూస్తున్నానని అన్నారు. ఉచిత ఇసుక టిడిపి ప్రభుత్వంలో ఇచ్చామని...ఇసుక పాలసీ తెస్తానన్న సిఎం జగన్ పాలసీ తేకుండా కాలాతీతం చేసారని అన్నారు. వందరోజులు సమయం తీసుకుని ఇసుక ధరను ఐదురెట్లు పెంచారని ఆరోపించారు. 

read more  టీడీపీకి దేవినేని అవినాష్ రాజీనామా

భవిష్యత్ పరిణామాలు ఆలోచించి ముందస్తు నిర్ణయాలు తీసుకోలేని అసమర్థ సిఎం జగన్ అని విమర్శించారు. రాజధాని ఎక్కడో తెలీని పరిస్ధితిలో ఏపి ప్రజలు ఉండే దుస్ధితిని తీసుకొచ్చారని అన్నారు. జగన్ కనుసైగతో అన్ని ఆపేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యంకు రిటర్న్ గిఫ్ట్ గా ఢిల్లీ వెళ్ళే పరిస్ధితి తెచ్చాడన్నారు. రాష్ట్రంలోని ఐదుకోట్ల ప్రజలకు అన్యాయం చేసారని  ఆరోపించారు. 

తెలుగుదేశం హయాంలో గోదావరి నుంచి పెన్నా వరకు ఉచిత ఇసుక సరఫరా చేశామని గుర్తుచేశారు. కానీ ఒక్క శాండ్ పాలసీ కోసం సీఎం జగన్ 3 నెలల 5 రోజుల కాలయాపన చేశారని మండిపడ్డారు. నెల్లూరులో ఒకప్పుడు రూ.వెయ్యి ఉన్న ట్రక్కు ఇసుక ధర ఇప్పుడు రూ.5వేలు అయిందని... రాష్ట్రంలో లేని సమస్యలు సృష్టిస్తున్నది ముఖ్యమంత్రి జగనేనని మండిపడ్డారు.