పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న  రీతిలో  నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ  మున్సిపల్ ఆఫీసులో నిద్రించి నిరసన  వ్యక్తం చేశారు. ప్రజలు డెంగ్యూ విష జ్వరాల బారిన పడకుండా పాలుకొల్లు పట్టణంలో పరిశుభ్రత చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి  చేశారు. టీడీపీ అదికారంలోఉన్నప్పుడే  తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరగాయని, ఇప్పటి  ప్రభుత్వం తన నియోజకవర్గంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 


పాలకొల్లు పట్టణంలో ఉన్న సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆయన శుక్రవారం నిరసనకు దిగారు.  తక్షణమే ప్రజల సమస్యలను  పరిష్కా రించాలంటూ
మున్సిపల్ ఆఫీసులోనే నిరసన తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మున్సిపల్ ఆఫీసులోని  కమిషనర్‌ ఛాంబర్‌లో ఉన్నారు. అప్పటికీ అధికారులు
రాకపోవడంతో రాత్రి అక్కడే నిద్రపోయారు.  ప్రజలు  అవస్థలపై ఎన్ని ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదన్నారు. ప్రత్యేకాధికారి నిర్లక్ష్య వైఖరిపై జిల్లా కలెక్టర్‌కు
లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు.  


 పట్టణంలో ప్రజా సమస్యలపై సమీక్షించేందుకు మున్సిపల్ అధికారులు సిద్దంలేకపోవడం  సిగ్గుచేటన్నారు.  వారు నిర్లక్ష్య వైఖరి కారణంగానే పట్టణంలో ప్రజటు డెంగ్యూ విష
జ్వరాల బారిన  పడుతున్నారని విమర్శించారు. వారు సమస్యలపై స్పందించే వరకు తాను ఇక్కడే ఉంటానని ఉద్ఘాటించారు. ఎన్ని రోజులైనా నిరీక్షించడానికి వెనుకాడబోనని
అధికారులను  హెచ్చరించారు.