విజయవాడ: కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా తీసుకుంటున్న నిర్ణయాలపై వైసిపి ప్రభుత్వాన్ని   నిలదీయనున్నట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. మరీముఖ్యంగా  ఆర్టీసి చార్జీల పెంపును నిరసిస్తూ తెలుగు దేశం పార్టీ ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపిస్తుందని మాజీ మంత్రి పేర్కొన్నారు.

గత ఐదేళ్ల పాలనలో టిడిపి ప్రభత్వం ఆర్టీసి, విద్యుత్ చార్జీలను పెంచలేదని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 
ఆర్టీసి చార్జీల పెంచి రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై 3500 కోట్ల భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి సమర్ధవంతంగా పాలించడం చేతకాకే ప్రజలపై భారం మోపారు మోపారని మాజీ మంత్రి మండిపడ్డారు. ఈ చార్జీల పెంపుపై రేపు అసెంబ్లీలో జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.  

read more దిశ నిందితుల ఎన్‌కౌంటర్, అయినా మారని మృగాళ్ళు... మైనర్ బాలికపై యువకుల అత్యాచారం

రాష్ట్రం మొత్తంలో ప్రస్తుతం సెక్షన్ 30ని రాజధాని అమరావతిలో 144 సెక్షన్ పెట్టారని విమర్శించారు. రైతులు ఆరుగాలాలు కష్టించి పండించిన ధాన్యం కొనుగోలు లో దళారుల ప్రమేయం  ఎక్కువయ్యిందని...దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఇప్పటివరకు రూ.3000 కోట్ల దోపిడీ జరుగిందని ఆరోపించారు. 

ఇక రాష్ట్రంలో ఉల్లి ధరలు ఆకాశనికంటినా ప్రభుత్వ చర్యలు శూన్యమని... రైతు బజార్ల వద్ద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో కేవలం ఇసుక మాఫియా, బెట్టింగ్ మాఫీయా, లిక్కర్ మాఫియాలదే హవా సాగుతున్నట్లు ఆరోపించారు. 

read more  బ్యాంక్ ఉద్యోగమే పెట్టుబడి... యువతుల జీవితాలతో ఆడుకుంటున్న నిత్యపెళ్లికొడుకు జైలుపాలు

మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... గత ఐదు నెలలు ఇసుక దొరక్కుండా దోచుకున్నారని అన్నారు. ఇప్పుడేమో ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలపై మరింత భారం మోపారని అన్నారు. ఇలా ప్రతినిత్యం ఏదో ఒక  సమస్యతో సామాన్యుడు ఇబ్బందులకు గురవుతూనే వున్నాడని రవీంద్ర అన్నారు.